49th Chief Justice of India : తన వారసుడి పేరును సిఫార్సు చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. ఆయన ఎవరంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెలలోనే పదవీ విరమణ పొందనున్నారు.. అయితే, తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? అనే చర్చ సాగుతోన్న తరుణంలో… ఊహాగానాలకు తెరదించుతూ.. జస్టిస్ యూయూ లలిత్ పేరును సిఫార్సు చేశారు సీజేఐ ఎన్వీ రమణ.. దీంతో, 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ యూయూ లలిత్.. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన ఆయన.. పూర్తి పేరు ఉదయ్ ఉమేశ్ లలిత్… తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్ తలాక్ సహా అనేక కీలక అంశాల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ లలిత్ భాగస్వామిగా ఉన్నారు..
Read Also: MP Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ లీక్…? ఇదే కుట్రే అంటున్న ఎంపీ..
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ఇక, జస్టిస్ యూయూ లలిత్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నారు.. 1971 జనవరిలో 13వ భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన మొదటి న్యాయవాది కాగా.. ఆయన తర్వాత బార్ అసోసియేషన్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై అనంతరం సీజేఐ అయిన రెండో వ్యక్తిగా రికార్డుకెక్కనున్నారు.. ఈ నెల 26వ తేదీన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనుండగా.. ఈ నెల 27వ తేదీన సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు జస్టిస్ లలిత్.. ఆయన 9 నవంబర్ 1957న జన్మించారు.. జూన్ 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకోగా.. డిసెంబర్ 1985 వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీసు చేసి.. జనవరి 1986 నుంచి తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చుకున్నారు.. ఇక, ఆగస్టు 13, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి అనేక కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు..
అయితే, తన వారసుడిగా జస్టిస్ యూయూ లలిత్ పేరును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గురువారం సిఫార్సు చేశారు. ఈరోజు ఉదయం జస్టిస్ లలిత్‌కు సిఫార్సు కాపీని అందజేశారు సీజేఐ ఎన్వీ రమణ… ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నందున తన వారసుడి పేరును సిఫారసు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం సీజేఐకి లేఖ రాశారు. జస్టిస్ లలిత్ ఆగస్టు 27న భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఆయన 74 రోజుల స్వల్పకాలం సీజేఐగా కొనసాగనున్నారు.. నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు జస్టిస్ లలిత్.. ఆ తర్వాత జస్టిస్ డీవై చంద్రచూడ్ భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు.
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!