ఈ రోజు వివిధ రాశుల వారి దినఫలాలు ఎలా వున్నాయి..? ఏ రాశివారికి ఎలా వుండబోతుంది? ఏ రాశివారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఏ దైవానికి ఎలాంటి పూజలు చేయాలి? ఏ రాశివారు ఏ పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఎవరు కొత్త పనులు మొదలు పెడితో మంచి జరగబోతోంది..? ఇలాంటి ఎన్నో సందేహాలు.. ఇవాళ్టి మీ దినఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.
తమిళిసై సౌందర్ రాజన్.. క్లౌడ్ బరస్ట్పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు వచ్చిన వరదలు క్లౌడ్ బరస్ట్ కాదని తేల్చేసిన ఆమె.. ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే, కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కువగా వరదలొచ్చాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్ఐఏ సోదాలు కలకలం సృష్టించాయి.. ఏకకాలంలో ప్రకాశం జిల్లా, విజయవాడ, నెల్లూరులో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. మావోయిస్టులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, విజయవాడలోని రెండు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష, విరసం నేత కల్యాణ్ రావు ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు.. శిరీష ఇంట్లో లేకపోవడంతో తాళం పగలగొట్టి మరీ సోదాలు చేపట్టడంపై ప్రజాసంఘాలు […]
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోయినా.. ఓట్లు, సీట్ల గురించి సవాళ్లు, ప్రతి సవాళ్లు వినిపిస్తున్నాయి.. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే.. ఈ సారి ఎక్కువగా వస్తాయని.. రాష్ట్రంలోని 175 స్థానాలకు 175 తామే గెలుస్తామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చెబుతున్నమాట.. అయితే.. రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 కాదు కదా.. 17 సీట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డిపై అలవల గ్రామంలో జరిగిన దాడి ఘటనను సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించిన ఆయన.. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడి చేశారంటే ఏపీలో శాంతి భద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? అని ప్రశ్నించారు.. తెలుగుదేశం కార్యకర్తలు, నేతల హత్యలకు జగన్ ప్రోత్సాహం ఉంది కాబట్టే.. వైసీపీ నేతలు […]