ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండో ఏడాది ప్రతిష్టాత్మక అవార్డులు ప్రకటించారు.. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, వైఎస్సార్ అచీవ్‌మెంట్ 2022 అత్యున్నత పురస్కారాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు జీవీడీ కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డుల ప్రక్రియ చేపట్టింది.. సామాన్యుల్లో ఉన్న అసామాన్యులను గుర్తించి సత్కరించటం దీని ప్రధాన ఉద్దేశ్యం అన్నారు.. మన సంస్కృతి, సంప్రదాయాలను వైఎస్సార్ ఒక ప్రతీకగా నిలబడ్డారు.. ఇదే కోవలో సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయం, విద్యా వంటి ఏడు రంగాలకు చెందిన వారిని అవార్డులను ఎంపిక చేశాం.. గత ఏడాది 62 మందికి అవార్డులను ఇచ్చాం.. ఈ ఏడాది 30 మందికి అవార్డుల ఎంపిక చేశామని తెలిపారు.
ఇక, కళలు- సంస్కృతి విభాగంలో కళాతపస్వి, దర్శకుడు కె.విశ్వనాథ్‌కు వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించారు.. ఆయనతో పాటు నటుడు ఆర్.నారాయణ మూర్తికి, రంగస్థల కళాకారుడు నాయుడు గోపికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది.. కళంకారి నేతన్న పిచుక శ్రీనివాస్, షేక్ గౌసియా బేగంలను వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులకు ఎంపిక చేశామని వెల్లడించారు.. సాహిత్య సేవా విభాగంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, ఎమెస్కో ప్రచురణాలయం, రచయిత శాంతి నారాయణలకు వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు దక్కగా.. వ్యవసాయ విభాగంలో ఆదివాసీ కేష్యూనట్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీకి చెందిన సోడెం ముక్కయ్య, కుశలవ కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీకి చెందిన గోపాలకృష్ణ, అన్నమయ్య మూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు చెందిన జయబ్బనాయుడు, అమృత ఫల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీకి చెందిన మౌక్తిక, కట్టమంచి బాలకృష్ణారెడ్డిలు వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులకు ఎంపికైనట్టు ప్రకటించారు..
సునీత కృష్ణన్, శిరీష రీహాబిలిటేషన్ సంస్థలకు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు.. దిశా యాప్ కు సంబంధించి చురుకైన పాత్ర పోషించిన పోలీసు శాఖలో ఐదుగురికి ఉమ్మడిగా వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డు.. వైద్య రంగంలో ఏసియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ బి. నాగేశ్వర రెడ్డి, శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, భారత్ బయోటెక్ కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా, అపోలో హాస్పిటల్స్ ప్రతాప్ రెడ్డి, ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు దక్కాయి.. ఇక, జర్నలిజం విభాగంలో నలుగురికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు వచ్చాయి.. భండారు శ్రీనివాసరావు, సతీష్ చంద్ర, మంగు రాజగోపాల్, ఎమ్‌వివి ప్రసాద్ ను ఆ అవార్డులకు ఎంపిక చేశారు.. జీఎమ్మార్ సంస్థకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.. మానసిక శాస్త్ర నిపుణుడు పట్టాభి రాంకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపిక చేశారు.. ఇక, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డు కింద ఐదు లక్షల రూపాయల నగదు.. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంగట్ అవార్డు పొందినవారికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రైజ్ మనీ అందించనున్నారు.