అడవిలో ఉండే అత్యంత భయంకరమైన జంతువులలో చిరుత ఒకటి.. దానిని చూస్తేనే వణుకు.. ఎక్కడి నుంచి ఎలా ఎటాక్ చేస్తుందోననే భయం అందరిలో ఉంటుంది.. కానీ, ఓ యువతి చిరుతతో చేసిన రొమాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది… సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన చాలా మంది యూజర్లు ఆమె చేసే పనిని చూసి షాక్ అవుతున్నారు.. ఏంటి ఇంత భయంకరమైన జంతువుకి ఈమె ముద్దులిచ్చి ప్రేమగా చూసుకుంటోంది అని. ఆ చీతా కూడా ఆమెపై అంత ప్రేమ కురుపిస్తుంది ఏంటి? అని నోరువెల్లబెడుతున్నారు.. మొత్తంగా నెటిజన్లను వారి రొమాన్స్ కట్టిపడేస్తోంది.
Read Also: Munugode Bypoll: ముగిసిన నామినేషన్ల స్వీకరణ గడువు.. క్యూలైన్‌లో భారీగా అభ్యర్థులు..
@africananimal ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ వీడియోకు గంటల వ్యవధిలో 100,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.. వీడియోలో, ఒక అమ్మాయి చిరుతను నిర్భయంగా కౌగిలించుకుని ముద్దులు పెడుతూ, ఆప్యాయతతో ముంచెత్తింది.. అడవిలో అత్యంత భయంకరమైన జంతువులలో చిరుత ఒకటి కాగా.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు.. ఎవరైనా దానిని ఎదుర్కొంటే తప్పించుకోవడం దాదాపు కష్టమే.. కానీ, ఆ జంతువులో కూడా ప్రేమ ఉంటుందని ఆ వీడియో చెబుతోంది.. ఈ వీడియోలలో ఒకదానిలో ఒక అమ్మాయి చిరుతతో ముద్దుపెట్టుకోవడం మరియు కౌగిలించుకోవడం కనిపించింది.. ఈ వీడియో వీక్షకులను ఆశ్చర్యపరిచింది, చాలా మంది అసాధారణమైన మానవ-జంతు పరస్పర చర్య గురించి ప్రశంసించారు.
ఆ వీడియోలో, అమ్మాయి చిరుతను నిర్భయంగా కౌగిలించుకుని ముద్దులు పెడుతూ, దానిని ఆప్యాయతతో ముంచెత్తింది.. ముద్దు అంటే.. చిరుత నుదుటిపైనే.. దాని శరీరంపైనే కాదు.. ఏకంగా దాని నోట్లో నోరుపెట్టే విధంగా.. ఆ యువత ముద్దులతో ముంచెత్తింది.. చిరుత కూడా ఆమెతో ఎంతో ప్రేమగా మెలిగింది.. ఆమెను ఆప్యాయంగా లాలించడం ద్వారా తన ప్రేమను తిరిగి ఇచ్చింది.. ఆ యువతి ముఖంతో పాటు.. శరీరాన్ని కూడా ప్రేమతో అది నాకడం కనిపించింది.. వారి విచిత్రమైన సంబంధం నెటిజన్లను ఫిదా చేస్తోంది.. @ఆఫ్రికన్ యానిమల్ ఇన్‌స్టాగ్రామ్‌లో లవ్ సింబల్‌తో “చిరుత ప్రేమ” చాలా సులభం అనే క్యాప్షన్‌తో వీడియో పోస్ట్ చేసింది ఆ యువతి.. ఆ వీడియో చాలా మంది యూజర్ల నుంచి లైక్‌లు షేర్‌లు పొందింది.. “ఓ మై గాడ్, ఆ జంతువు ఆమెను ముద్దుపెట్టిందా? అని నెటిజన్ కామెంట్ పెడితే.. మరొకరు “ఒక సినిమా ఫ్రేమ్‌లో రెండు చిరుతలు” అని రాశారు. మరో వ్యక్తి.. “ఎప్పటికీ మంచి స్నేహితులు” అని వ్యాఖ్యానించాడు. మరొకరు, “తలను రుద్దుతారు మరియు ఫ్లఫర్ నుండి ముద్దులు పెడుతున్నారు” అని వ్యాఖ్యానించారు. ఇక, మరోవ్యక్తి.. “ఈ ప్రపంచంలో ఒక చిన్న ప్రేమ మరియు శ్రద్ధ ఎంత దూరం వెళ్ళగలదో ఇది చూపిస్తుంది.” అని కామెంట్ రాసుకొచ్చారు.. ఇలా నెటిజన్లలో ఆ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటుంది.