* ఢిల్లీ: లోక్‌సభలో నేడు జాతీయ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చ.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు చర్చను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. వందేమాతరంపై ప్రత్యేక చర్చ కోసం 10 గంటలు కేటాయింపు
* నేడే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు జరగనున్న గ్లోబల్ సమ్మిట్.. పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం.. 44 దేశాల నుంచి 154 మంది అతిథుల రాక.. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీల నుంచి ప్రతినిధి బృందాలు.. ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు సమ్మిట్ ప్రారంభం.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. 2.30కి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం.. వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు..
* రేపు తెలంగాణ విజన్ – 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ..
* గ్లోబల్ సమ్మిట్‌లో సినీ రంగంపై ప్రత్యేక చర్చ.. వన్ కంట్రీ – మెనీ సినిమాస్ పేరుతో ప్యానల్ డిస్కషన్స్.. ఫిల్మ్ ఇన్ తెలంగాణ పేరుతో సినిమాల నిర్మాణం
* రేపు సాయంత్రం గంటలకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మగింపు వేడుకలు.. రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనాలు
* అమరావతి: ఇవాళ ఉదయం 10.45కి సచివాలయానికి సీఎం చంద్రబాబు.. పలు కీలక శాఖలపై సమీక్ష నిర్వహించనున్న సీఎం
* రేపటి నుంచి ఏపీలో గూడ్స్ రవాణా నిలిపివేస్తున్న లారీ ఓనర్స్.. టెస్టింగ్, ఫిట్‌నెస్ చార్జీలు తగ్గించాలని ఆందోళన.. 13 ఏళ్లు దాటిన వాహనాలపై ఫిట్‌నెస్ ఫీజులు పెంపు విరమించాలని నిరసన
* అల్లూరి ఏజెన్సీపై చలి పంజా.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. మినుములూరు, జి.మాడుగులలో 6 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అరకు 7, పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
* తిరుమల: 12 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,343 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 26,505 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజమండ్రి రాక.. నన్నయ్య యూనివర్సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొననన్న వెంకయ్య నాయుడు
* ఖమ్మం: నేడు మధిర ( మం) మాటూరుపేటలో ఆంధ్రప్రదేశ్ జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సతీమణి పద్మజ పర్యటన.. జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం.
* ఖమ్మం: నేడు మధిర మండలంలో సిపిఐ సర్పంచ్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సిపిఐ నాయకులు కూనంనేని సాంబశివరావు.
* కాకినాడ: నేడు కాజులూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొనున్న మంత్రి వాసంశెట్టి సుభాష్