వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలపై చర్చించారు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు.. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని వారికి లేదు.. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వినాలన్న ఆలోచన వారికి లేదన్న జగన్.. కొంతమంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ, మేం అలా చేయలేదు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎవరూ…
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీ కి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.. లిక్కర్ కేసులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్.. అయితే, సిట్ పిటిషన్పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. మిథున్రెడ్డిని రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు…
ఏపీ శాసన మండలి సమావేశాలు మొదటి రోజే వాడివేడిగా జరిగాయి. మండలి మొదటి రోజు వాయిదాల పర్వం కొనసాగింది. యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చకు వైసీపీ పట్టు పట్టింది.. రైతు సమస్యలపై వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన తో సభ మొదటి సారి వాయిదా పడింది. మరోవైపు తిరుపతిలో జరుగుతున్న వరుస సంఘటనల పైనా సభలో హాట్ హాట్ గా చర్చ జరిగింది. తిరుమల సంఘటనలపై మంత్రి ఆనం తీరుకి నిరసనగా వైసీపీ సభ్యులు సభ నుంచి…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. అసలు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్ లో ఏముందో ఒకసారి చూడాలని హితువు పలికారు.. అయితే, తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చిన సమయంలో తాము ఏం అనలేదనే విషయాన్ని గుర్తుచేశారు జేసీ..
"చంద్రబాబు గారూ.. మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసిమరీ ఇచ్చిన ఇళ్లస్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి, మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్కచెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? తక్షణం ఈ నిర్ణయాన్ని…
Off The Record: నా బంగారం… అసెంబ్లీలో కొరమీనంత మైకట్టుకోని అధ్యచ్చా…. అంటుంటే దాన్ని నేను టీవీలో చూసి మురిసిపోవాల. ఓ పాపులర్ సినిమాలో విలన్ డైలాగ్ ఇది. సినిమా కాబట్టి విలన్ నోట్లో నుంచి ఆ డైలాగ్ వచ్చినా… బయట చాలామంది పొలిటికల్ హీరోల డ్రీమ్ ఇది. సినిమాలో భార్యను ఉద్దేశించి విలన్ అన్నా… నిజ జీవితంలో మాత్రం ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యేలై పోవాలని కలలుగంటుంటారు. అధ్యక్షా అన్న మూడక్షరాలు పలకడానికి కొందరు నాయకులకు జీవితకాలం […]
Off The Record: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పోటీ చేసి గెలిచిన ఏకైక అసెంబ్లీ సీటు తిరుపతి. ఆరణి శ్రీనివాసులు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఉమ్మడి జిల్లాలో పోటీ చేసింది ఒకే సీటు అయినా…ఎన్నికల టైంలో… ఆ గెలుపు సౌండ్ మాత్రం రాయలసీమ మొత్తంలో ప్రతిధ్వనించింది. చివరి నిమిషంలో సీటు దక్కినా… 60వేలకు పైగా భారీ మెజారిటీతో ఆరణి విజయం సొంతం చేసుకోవడం గురించి అప్పట్లో బాగా మాట్లాడుకున్నారు. ఎన్నికలకు ముందు వరకు వైసీపీ […]
Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ నాయకులకు విచిత్రమైన సమస్య వచ్చి పడిందట. పండగ అన్న మాట వినిపిస్తే చాలు… నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తున్నారట. ఎవరికి వారు పండగల్ని హాయిగా, జాలీగా, కుటుంబ సమేతంగా చేసుకుంటుంటే… వీళ్ళకు మాత్రం అదీఇదీ అని లేదు. ఏదో ఒకటి… పండగ… అన్న మాట వినిపిస్తే చాలు దిగాలుగా ఫేస్లు పెట్టేసి జేబులు తడుముకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలకే […]
Off The Record: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అత్యంత కీలకమైన బిల్లులను ఇంకా ఆమోదించకుండా పెండింగ్లో పెట్టడంపై కొత్త కొత్త అనుమానాలు పెరుగుతున్నాయట. ఇప్పటికే ప్రభుత్వం చట్ట సభల్లో ఐదు బిల్లుల్ని ఆమోదించి గవర్నర్కు పంపింది. బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న 50 శాతం నిబంధనను ఎత్తేస్తూ…. రిజర్వేషన్స్ పెంచేందుకు ఉద్దేశించిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. పురపాలక చట్ట సవరణ బిల్లుకు కూడా ఓకే చెప్పేసింది సభ. ఇక అల్లొపతిక్ […]