హీరో విశాల్, డైరెక్టర్ ఎ. వినోద్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఆగస్ట్ 12న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ సమయంలో విశాల్ కు పలు గాయాలు కావడంతో అనుకున్న సమయానికి ఈ చిత్రం పూర్తి కాలేదు. అలానే ఫైట్ సీక్వెన్స్ కు సంబంధించిన వి.ఎఫ్.ఎక్స్. వర్క్ సైతం పెండింగ్ లో పడిపోయింది. దీంతో సినిమా విడుదలను సెప్టెంబర్ 15కి వాయిదా వేశారు. ఈ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
విశాల్ సరసన సునైనా కథానాయికగా నటిస్తుంది. ‘సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి వుందని, విశాల్ తన ‘లాఠీ’ తో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికారన్నది సినిమాలో ఆసక్తికరంగా దర్శకుడు తెరకెక్కించారని, ద్వితీయార్ధంలో ఉండే 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయ’ని నిర్మాతలు తెలిపారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ‘లాఠీ’ టైటిల్ తోనే ఈ మూవీ విడుదల కానుంది. . ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. సంగీతాన్ని సమకూర్చారు.