ప్రముఖ యు ట్యూబర్, బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ ఓటీటీ ఫ్లాట్ ఫై ఎంట్రి ఇస్తున్నాడు. ఆహాలో ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ పేరుతో వెబ్ సీరీస్ చేస్తున్నాడు. ఈ వెబ్ సీరీస్ టీజర్ ను అనిల్ రావిపూడి విడుదల చేశారు.
ఈ సీరీస్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి వారం ఒక్కో కొత్త ఎపిసోడ్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసింది ఆహా. డిటెక్టీవ్ కావాలని ప్రయత్నించే సంతోష్ డిటెక్టీవ్ ఏజెన్సీలో చేరతాడు. అక్క తన స్నేహితుడు అయోమయం తో కలసి ఎలాంటి కేసులు పరిష్కరిస్తారన్నదే ఈ సీరీస్. ఇన్ఫిటమ్ తో కలసి ఆహా అందిస్తున్న ఈ సీరీస్ లో సంతోష్ గా షణ్ముఖ్ జస్వంత్, అతని స్నేహితుడుగా పృథ్వీ ఝకాస్ నటిస్తున్నారు.