కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొత్త చిత్రానికి ‘ఘోస్ట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జులై 12 బుధవారం పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పాన్ ఇండియా సినిమాగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కనుంది. ‘బీర్బల్’ దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రం క్లైమాక్స్ తో పాటు కొత్త తరహాలో ఉండే స్క్రీన్ ప్లే నచ్చి నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట శివరాజ్ కుమార్. మెయిన్ థీమ్ భాషాతీతంగా అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యేలా ఉంటుందని, అందుకే పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నామని అంటున్నారు దర్శకనిర్మాతలు. కిచ్చా సుదీప్ ‘ఘోస్ట్’ ఫస్ట్ పోస్టర్ విడుదల చేసి శివరాజ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్ డిజైన్ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. గన్ పట్టుకుని తీక్షణంగా చూస్తున్న శివరాజ్ కుమార్ లుక్ యాక్షన్ చిత్రం అని తెలియచేస్తోంది. సెర్చ్ లైట్, బైకర్స్, కార్స్, గన్స్ వీటితో డిజైన్ చేసిన పోస్టర్ డిటైలింగ్ ఆకట్టుకునేలా ఉంది. అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ చివరి వారంలో ప్రారంభం కానుంది.