తొలి సినిమా ‘ఉప్పెన’తో ఉవ్వెత్తున ఎగసి పడ్డాడు పంజా వైష్ణవ్ తేజ్. అయితే రెండో సినిమా ‘కొండ పొలం’ టక్కున క్రింద పడేసింది. దాంతో కొంత గ్యాప్ తీసుకుని మూడో సినిమా ‘రంగ రంగ వైభవంగా’తో రాబోతున్నాడు వైష్ణవ్ తేజ్. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. విడుదలైన టీజర్ తో పాటు పాటలు సినిమాపై నమ్మకాన్ని పెంచాయి.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కేతికా శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విడుదల తేదీని నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటిచింది. ఈ చిత్రానికి తమిళంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా డైరెక్ట్ చేసిన గిరీశయ్య దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’కు సంగీతాన్ని అందించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించారు.