సంక్రాంతి సీజన్ లో ఎన్టీవీ ఎంటర్ టైన్మెంట్ తన వ్యూవర్స్ ముందుకు సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అదే ‘ఫన్ ఫీస్ట్ విత్ అషూ రెడ్డి’! ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఫస్ట్ వీక్ దేత్తడి హారిక మనసులోని మాటల్ని వ్యూవర్స్ ముందు ఆవిష్కరింప చేసింది అషూ రెడ్డి. సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్ లో జనం ముందుకు వస్తోంది తేనెకళ్ళ సోయగం దివి వైద్య!
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ లో మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ గా పేరు తెచ్చుకున్న సొట్టబుగ్గల చిన్నది దివిని చూసి మనసు పారేసుకోని కుర్రకారు లేరంటే అతిశయోక్తి కాదు! ఆమె స్క్రీన్ మీద కనిపించినంత సేపూ చూపును మరొకరి వైపు మళ్ళించలేదు జనం. ఇది నిజం!! అందుకే మెగాస్టార్ చిరంజీవి సైతం బేషరతుగా తన సినిమాలో అమ్మడికి ఛాన్స్ ఇస్తానని అప్పట్లోనే హామీ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు ‘బోళాశంకర్’ మూవీతో నిలబెట్టుకున్నారు. ‘ఫన్ ఫీస్ట్ విత్ ఆషూరెడ్డి’ సెకండ్ ఎపిసోడ్ లో దివి మెగా స్టార్ తో షూటింగ్ ముచ్చట్లు తెలియచేసింది. అంతేకాదు… వెండితెర గ్రీకు వీరుడు, సిల్వర్ స్క్రీన్ మన్మధుడు నాగార్జున మాటలకు తాను ఎలా ఫ్లాట్ అయిపోయానో కూడా తెలిపింది. ఇంకో విశేషం ఏమంటే… ఐ వాంట్ ఏ బాయ్ ఫ్రెండ్ అంటూ తన మనసులో మాట కూడా దివి చెప్పేసింది. సో… ఆమె కోరుకుంటున్న బాయ్ ఫ్రెండ్ కు ఉండాల్సిన లక్షణాలేవో తెలుసుకోవాలంటే… ఆదివారం స్ట్రీమింగ్ అయ్యే… ‘ఫన్ ఫీస్ట్ విత్ ఆషూ రెడ్డి’ ప్రోగ్రామ్ చూడాల్సిందే!
సూటిగా సుత్తి లేకుండా సాగిన ఈ ప్రోగ్రామ్ లో మీ మనసులో ఉన్న ఎన్నో సందేహాలకు కూడా దివిని అడిగి జవాబులు రాబట్టింది ఆషూ రెడ్డి… సో ఇప్పుడైతే ‘ఫన్ ఫీస్ట్ విత్ అషూ రెడ్డి’ ప్రోగ్రామ్ ప్రోమో చూసేయండి!!