టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా విడుదల తేదీ ప్రకటనల జాతర కొనసాగుతోంది. చిరంజీవి, వెంకటేశ్, పవన్ కళ్యాణ్, రానా, జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ చిత్రాల రిలీజ్ డేట్స్ తో పాటే… ఇప్పుడు ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ సైతం కొత్త డేట్ ను లాక్ చేసింది. ఏప్రిల్ 1న విడుదల కావాల్సిన ఈ సినిమాను మే 12న విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఆక్షన్ తేదీని లాక్ చేశామంటూ వారు ఓ నయా పోస్టర్ ను ట్వీట్ చేశారు. మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ నటిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజు నుండి హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ మొదలైందని, అయితే మహేశ్ బాబు ఫిబ్రవరి రెండోవారంలో షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది.