ప్రముఖ నటి ప్రియమణి ‘భామా కలాపం’ ఒరిజినల్ ద్వారా ఆహా ఓటీటీ మాధ్యమంలోకి అడుగుపెడుతున్నారు. అభిమన్యు తాడి మేటి ఈ వెబ్ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 11న ‘ఆహా’లో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. ‘డియర్ కామ్రేడ్’ డైరెక్టర్ భరత్ కమ్మ షో రన్నర్ కాగా, అభిమన్యు తాడి దీనిని డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ ఒరిజినల్ ట్రైలర్‌ను ‘లైగర్’ స్టార్ విజయ్ దేవరకొండ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ”నేను నలబై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. అందరూ ఆదరించారు. ఇప్పుడు మా అబ్బాయి బాపినీడు, సుధీర్‌తో కలిసి ఎస్‌వీసీసీ డిజిటల్ మీద చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాం” అని అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ”భరత్ కమ్మ తన మొదటి సినిమా ‘డియర్ కామ్రేడ్’ నాతో చేశాడు. తనతో సినిమా చేయాలని నేనే కోరుకున్నాను. నా కెరీర్లో మరచిపోలేని చిత్రమది. ప్రియమణిగారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఏ లాంగ్వేజ్‌లో చేసిన సూట్ అయిపోతారు. ఈ ‘భామా కలాపం’ తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఆహా టీమ్‌కు ఆల్ ది బెస్ట్” అని అన్నారు.
ప్రియమణి మాట్లాడుతూ ” ‘భామా కలాపం’ నా డిజిటల్ బెస్ట్ డెబ్యూ మూవీ అని చెప్పాలి. మొదటి షెడ్యూల్ కోసం ఆరు రోజులు కేటాయించాను. తర్వాత షెడ్యూల్ కోసం నెలన్నర పాటు సమయం ఇవ్వలేకపోయాను. తర్వాత సింపుల్‌గా, స్వీట్‌గా పూర్తి చేసేలా భరత్, అభి వర్క్ చేశారు. అనుపమ వంటి క్యారెక్టర్‌ను ఇప్పటి వరకు నేను ప్లే చేయలేదు. చాలా అమాయకమైన గృహిణి పాత్రలో కనిపిస్తాను” అని చెప్పారు. భరత్ కమ్మ మాట్లాడుతూ ”అభి నాతో 8 ఏళ్లుగా రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. లాస్ట్ లాక్‌డౌన్ సమయంలో ఈ ఐడియా చెప్పాడు. ఇద్దరం కలిసి పాయింట్ మీద వర్క్ చేశాం. ఆహా టీమ్, అరవింద్‌గారికి ఈ కథ చెప్పగానే వారికి బాగా నచ్చేసింది. అయితే అనుపమ పాత్రలో ఎవరు చేస్తారనే దానిపై అప్పుడింకా నిర్ణయించుకోలేదు. ఆ పాత్రలో నటించడానికి ఒప్పుకున్న ప్రియమణిగారికి థాంక్స్. ఎస్‌వీసీసీ మీద దీన్ని ప్రొడ్యూస్ చేసిన బాపినీడు, సుధీర్ గార్లకు థాంక్స్” అని అన్నారు.