ఒకప్పుడు ఇండియన్ సినిమాలో సంచలనాత్మక దర్శకుడిగా పేరుగాంచిన శంకర్, ఇటీవల వరుస డిజాస్టర్‌లతో విమర్శలపాలవుతున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’ మరియు రామ్‌చరణ్‌తో రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌ల ఆలస్యం, పెరిగిన బడ్జెట్ కారణంగా ఇప్పటికే నిర్మాతలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా డిజాస్టర్‌లుగా మారితే, శంకర్ పనైపోయిందనే కామెంట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న దర్శకుడు శంకర్.. మరో భారీ బడ్జెట్ సినిమాకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించడం తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు శంకర్, తన తదుపరి ప్రాజెక్ట్ గురించి సంచలన ప్రకటన చేశారు.
Also Read :Pushpa 2: జపాన్‌లో ‘పుష్ప 2’.. అక్కడికే ఎందుకు?
ప్రముఖ తమిళ రచయిత సు. వెంకటేశన్ రాసిన, లక్ష కాపీలు అమ్ముడైన చారిత్రక నవల ‘వేల్పారి’ ఆధారంగా సినిమా తీయనున్నట్లు తెలిపారు. ఒకప్పుడు ‘రోబో’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిన శంకర్, ఇప్పుడు ‘వేల్పారి’ని కూడా భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తీయనున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌లో శంకర్ మరింత భారీ రిస్క్‌కు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. “గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవతార్ వంటి చిత్రాలకు ఉపయోగించిన టెక్నాలజీని ‘వేల్పారి’ ద్వారా పరిచయం చేస్తాం. ప్రపంచమంతా ఈ సినిమాను గుర్తిస్తుంది.” అని ఆయన అన్నారు. అవతార్ లాంటి టెక్నాలజీని ఉపయోగించి సినిమా తీయడం అంటే, బడ్జెట్ అంచనాలకు అందని విధంగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే శంకర్ సినిమాలంటే భారీ బడ్జెట్, ఆలస్యం అనే ముద్ర పడింది. ఈ టెక్నాలజీతో సినిమా తీస్తే, బడ్జెట్ 1000 కోట్లు దాటిపోతుందా అనే భయం నిర్మాతల్లో కలుగుతోంది. ‘భారతీయుడు 2’ సినిమాతో లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలను శంకర్ ముంచారనే విమర్శలు ఉన్నాయి. అలాగే, ‘గేమ్ ఛేంజర్’ ఆలస్యం కారణంగా నిర్మాత దిల్ రాజు కూడా దెబ్బతిన్నారని టాక్.
Also Read :Akhanda2 Thandavaam : అఖండ 2.. కోర్టులో వాదనలు ప్రారంభం.. తీర్పుపై ఉత్కంఠ
వరుసగా రెండు పెద్ద ప్రాజెక్టులతో నిర్మాతలను నిలువునా ముంచి, డిజాస్టర్లకు దగ్గరగా ఉన్న ఫ్లాప్ డైరెక్టర్‌ను నమ్మి మరోసారి ఇంతటి భారీ రిస్క్ చేసే నిర్మాత ఎవరు? కెరీర్‌ను పణంగా పెట్టి డేట్స్ ఇచ్చే స్టార్ హీరో ఎవరు? అనే ప్రశ్నలు ఇప్పుడు తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ శంకర్ చెప్పినట్టుగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే, అది కేవలం అదృష్టం వల్లే సాధ్యమవుతుందని, ఎన్ని ఫ్లాపులు పడినా అతనికి ఏమీ కాదనే వాదనకు బలం చేకూరుతుంది. ఎందుకంటే, వరుస పరాజయాలు లేదా వివాదాలు ఉన్న దర్శకుడిని నమ్మి, 1000 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీయడానికి ఏ నిర్మాత అయినా సిద్ధమవ్వడం అత్యంత సాహసంతో కూడిన విషయం. ఏదేమైనా, నిర్మాతలను నిలువునా ముంచి మరో భారీ సినిమాకు రెడీ అవుతున్న ఆ దర్శకుడు శంకరే. ఆయన ప్రకటించిన ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.