ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని బ్రీచ్ కాండీ హాస్పిటల్ వైద్యులు ప్రతీత్ సమదాని శనివారం తెలిపారు. కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన తర్వాత జనవరిలో లతా మంగేష్కర్‌ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. అయితే అదే నెల 27న హాస్పిటల్ లో వెంటిలేటర్ తొలగించారని, ఆమె అడిగిన ప్రశ్నలకు బదులిస్తున్నారని, చేతితో సంజ్ఞలు చేస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ ఈ రోజు పరిస్థితి తిరిగి విషమించడంతో మళ్ళీ వెంటిలేటర్ సాయంతో చికిత్స చేస్తున్నట్టు తెలుస్తోంది. 92 సంవత్సరాల ఈ గాన కోకిల పలు భారతీయ భాషల్లో 30 వేలకు పైగా పాటలను పాడారు.