Srisailam: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇక, శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, అర్చకులతో ఈవో శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. గత ఏడాది కంటే 30 శాతం ఎక్కువగా భక్తులకు శివరాత్రి ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. భక్తుల క్యూలైన్లు, మంచి నీరు, పారిశుద్ధ్యం, అటవీ ప్రాంతంలో నడకదారి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని పేర్కొన్నారు. ఇక, ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి రోజు ప్రభుత్సవం, పాగా లంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం జరగనున్నాయి.
Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్ “మానసిక రోగి”, అతడి వల్ల దేశ భద్రతకు ముప్పు: పాక్ ఆర్మీ..
ఇక, ఫిబ్రవరి 16వ తేదీన శ్రీ మల్లిఖార్జున స్వామి అమ్మవారి రథోత్సవం ఏర్పాట్లపై ఆలయ ఈవో శ్రీనివాసరావు చర్చించారు. అయితే, 11 రోజుల పాటు వైభవంగా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం తెలిపింది. ఏర్పాట్లు అన్ని జనవరి చివరిలోగా పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.