బాలీవుడ్ లో ఈ యేడాది ప్రారంభంలోనే వెడ్డింగ్ బెల్స్ మ్రోగడం మొదలైంది. వరుసగా వెండితెర, బుల్లితెర భామలు పెళ్ళి పీటలు ఎక్కేస్తున్నారు. ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూథీ, నాగిన్, బాల్ వీర్’ వంటి సీరియల్స్ తో పాటు ‘బిగ్ బాస్ సీజన్ 8’ లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది కరిష్మా తన్నా సైతం పెళ్ళికూతురైపోయింది. ‘నాచ్ బలియే 7, ఝలక్ దిఖ్ లా 9, ఖత్రోంకీ ఖిలాడీ 10’ సీజన్స్ లో పాల్గొన్న కరిష్మా తన్నాకు మంచి క్రేజ్ ఉంది. ‘సంజు’, ‘లాహోర్ కన్ఫిడెన్షియల్’తో పాటు పలు చిత్రాలలోనూ నటించిన 38 సంవత్సరాల కరిష్మా వివాహం ఫిబ్రవరి 5న ముంబైలో బోయ్ ఫ్రెండ్, బిజినెస్ మ్యాన్ వరుణ్ బంగేరాలో జరుగబోతోంది.
గురువారం హల్దీ వేడక జరగగా, శుక్రవారం మెహందీ ఫంక్షన్ ధూమ్ ధామ్ గా సాగింది. వీటికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను కరిష్మా తన్నా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట గత యేడాది చివరిలో వివాహ నిశ్చితార్థం జరుపుకుంది. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా శనివారం పెళ్ళిని సింపుల్ గా కొద్ది మంది సమక్షంలోనే కలర్ ఫుల్ గా జరుపుకోబోతున్నారు. వీరి హల్దీ, మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.