దళపతి విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో బిగ్ స్టార్ కాస్ట్ తో ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్న భారీ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా రాబోతోంది. విశేషం ఏమంటే… మనకు సంక్రాంతి పండగలానే తమిళనాడులోనూ పొంగల్ ను గ్రాండ్ గా చేసుకుంటారు. ఈ సీజన్ లో విడుదలైన విజయ్ చిత్రాలు అనేకం సూపర్ సక్సెస్ అయ్యాయి. దాంతో సెంటిమెంట్ గానూ ఇదే సరైన తేదీ అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మికా […]
చేంబోలు సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మారిన రోజు జూన్ 5 1986! ఆ రోజున కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ చిత్రం విడుదలైంది. దానికి ముందు సీతారామశాస్త్రి రాసిన గీతం ఒకటి ‘జననీ జన్మభూమి’ చిత్రంలో ఉన్నా టైటిల్ కార్డ్స్ లో ఆయన పేరు చేంబోలు సీతారామశాస్త్రిగానే పడింది. ఏ ముహూర్తాన ఆయన ‘సిరివెన్నెల’ను ఇంటి పేరుగా మార్చుకున్నారో గానీ జీవిత చరమాంకం వరకూ తన కలం ద్వారా సినీ వనంలో సిరివెన్నెల కురిపిస్తూనే ఉన్నారు. మే […]
‘ఆహా’ ఓటీటీలో మొదటిసారి సీజన్ 2 ఛాన్స్ దక్కించుకుంది ‘సర్కార్’ షో! పాపులర్ స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు నిర్వహించిన ఈ షోకు సూపర్ రెస్పాన్స్ రావడంతో సెకండ్ సీజన్ కూ నిర్వాహకులు సై అనేశారు. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకున్న ‘సర్కార్ -2’ థర్డ్ ఎపిసోడ్ ను బిగ్ బాస్ టీమ్ తో చేశారు. దానికి సంబంధించిన ప్రోమో మంగళవారం విడుదలైంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న సింగర్ శ్రీరామచంద్ర, యాంకర్స్ రవి, […]
ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో, హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటోంది ‘ఏజెంట్’ చిత్రం. ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. దేశభక్తి అంశాలతో రూపుదిద్దుకుంటున్న సినిమా కాబట్టి దీన్ని ఆగస్ట్ 12న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు తొలుత భావించారు. అయితే సినిమా షూటింగ్ లో జాప్యం జరుగుతున్న కారణంగా ఆ […]
తమిళ స్టార్ హీరో ధనుష్ పేరు వినగానే, ఆయన విలక్షణమైన అభినయం ముందుగా గుర్తుకు వస్తుంది. ధనుష్ తండ్రి కార్తిక్ రాజా తమిళ చిత్రసీమలో పేరు మోసిన రచయిత, దర్శకుడు. అన్న సెల్వరాఘవన్ పేరున్న దర్శకుడు. ఆరంభంలో వారి నీడన నిలచిన ధనుష్ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు అయ్యాడు. ఇవన్నీ ధనుష్ కు మొదటిరోజుల్లో కాసింత గుర్తింపు తేవడానికి పనికి వచ్చాయి. తరువాత అంతా ధనుష్ స్వయంకృషితో సాధించుకున్నదే. తమిళ, తెలుగు, మళయాళ చిత్రాల్లో […]
తెలుగు పరిశ్రమకు ఇండస్ట్రీ హిట్స్, ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ అందించిన ఘనత ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజుకు ఉంది. చిత్రం ఏమంటే ఆయన దర్శకుడిగా మారి భిన్నమైన కథాంశాలను తెరకెక్కిస్తున్నారు. గత యేడాది ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వచ్చిన ‘డర్టీ హరి’ చిత్రం ఇటు ప్రేక్షకులలో, అటు పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇటీవల ఆయన రూపొందించిన ‘7 డేస్ 6 నైట్స్’ విడుదలకి సిద్ధంగా ఉండగానే మరో సినిమాను ప్రకటించారు. అదే ‘సతి’. సుమంత్ అశ్విన్, మెహెర్ […]
ప్రతి మనసులో రాతగాడు దాగుంటాడో లేదో కానీ, ప్రతి మనిషిలో ఓ పాటగాడు మాత్రం తప్పనిసరిగా ఉంటాడు అంటారు మానసిక నిపుణులు. జీవితంలో ఏదో ఒక సందర్భంలో అందరూ కూనిరాగాలు తీసేవారే. చివరకు బుద్ధిమాంద్యం ఉన్నవారిలోనూ పాట పాడాలనే తలంపు ఉంటుందనీ చెబుతారు. నేడు గీత రచయితగా తనదైన పంథాలో పయనిస్తున్న చంద్రబోస్ చదువుకున్నది ఇంజనీరింగ్. గాయకుడు కావాలనే చిత్రసీమలో అడుగుపెట్టారు. కానీ, చిత్రంగా వందలాది మంది గాయకుల నోట తన పాటను పలికించే స్థాయికి చేరుకున్నారాయన. […]
నటరత్న యన్.టి.రామారావు చిత్రసీమలో ప్రవేశించక మునుపు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ‘జానపద చిత్రాల కథానాయకుని’గా ఓ వెలుగు వెలిగారు. తరువాతి రోజుల్లో అత్యధిక జానపదాల్లో నటించిన ఘనతను యన్టీఆర్ సొంతం చేసుకోగా, ఏయన్నార్ సాంఘిక చిత్రాలతో ముందుకు సాగారు. యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన తొలి చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ రామారావుకు తొలి జానపద చిత్రం కావడం విశేషం. ఇక వారిద్దరూ నటించిన తరువాతి సినిమా ‘సంసారం’ ఏయన్నార్ కు మొట్టమొదటి సాంఘిక చిత్రం కావడం ఇంకో […]
‘అల్లరోడు’గా జనం మదిలో నిలచిన నరేష్ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం ‘అల్లరి’ సినిమా విడుదలై మే 10వ తేదీకి ఇరవై సంవత్సరాలు అవుతోంది. హీరోగా నరేష్ కు, దర్శకునిగా రవిబాబుకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ‘అల్లరి’ చిత్రం 2002 మే 10న విడుదలయింది. ‘అల్లరి’ చిత్రం కథ ఏమిటంటే – రవి, అపర్ణ చిన్ననాటి స్నేహితులు. ఒకే అపార్ట్ మెంట్స్ లో ఉంటారు. రుచి అనే అమ్మాయి వాళ్ళుండే అపార్ట్ మెంట్స్ లో […]
తెలుగు తెరపై నటరత్న నందమూరి తారక రామారావుకు ముందు, తరువాత ఎందరు నటులు శివుని పాత్రలో నటించినా, ఆ మూర్తిలాగా పరమశివుని పాత్రలో సరితూగిన వారు లేరు. యన్టీఆర్ తొలిసారి శివుని పాత్రలో నటించిన చిత్రం `దక్షయజ్ఙం`(1962). రామారావుకు తొలినుంచీ గురువులను, పెద్దలను గౌరవించడం అలవాటు. తనకు అనేక చిత్రాలలో తల్లిగా నటించిన కన్నాంబ అన్నా, ఆమె భర్త ప్రముఖ నిర్మాత, దర్శకులు కడారు నాగభూషణం అన్నా యన్టీఆర్ కు ఎంతో గౌరవం! వారిపై ఎంత గౌరవం […]