Akhanda2 Release Teaser: ఎక్కడ చూసిన ఇప్పుడు అఖండ 2 ఊపే నడుస్తుంది. తాజాగా ‘అఖండ-2: తాండవం’ గ్రాండ్ రిలీజ్ టీజర్ వచ్చేసింది. ఈ టీజర్‌లో బాలయ్య బాబు ఎలివేషన్స్ సీన్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు, తిశ్రూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు, ఎవర్రా ఆ విబూది కొండను ఆపేది అంటూ పలికిన డైలాగ్స్ టీజర్‌లో హైలేట్‌గా నిలిచాయి. ఈ టీజర్ చూస్తున్నంత సేపు బాలయ్య రుద్రతాండవం కనిపించింది.
READ ALSO: Shocking : పటాన్‌చెరులో పరువు హత్య.. యువకుడిని కొట్టి చంపిన యువతి తల్లిదండ్రులు
నందమూరి అభిమానులతో పాటు, సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా అఖండ 2. తాజాగా రిలీజ్ అయిన 67 సెకన్ల టీజర్‌లో బోయపాటి శ్రీను మాస్ మ్యాజిక్ మళ్లీ ఆవిష్కృతమైంది. మంచు పర్వతాలు, అగ్ని జ్వాలలు, రక్తం కకకలాడే యాక్షన్.. అంతకంటే మించి బాలయ్య దివ్య రౌద్ర రూపం ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే సోషల్ మీడియా అంతా బాలయ్య మాస్ జాతరతో మారుమోగిపోతుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.
READ ALSO: OYO యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై దానితో పని లేదు