‘ఆహా’ ఓటీటీలో మొదటిసారి సీజన్ 2 ఛాన్స్ దక్కించుకుంది ‘సర్కార్’ షో! పాపులర్ స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు నిర్వహించిన ఈ షోకు సూపర్ రెస్పాన్స్ రావడంతో సెకండ్ సీజన్ కూ నిర్వాహకులు సై అనేశారు. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకున్న ‘సర్కార్ -2’ థర్డ్ ఎపిసోడ్ ను బిగ్ బాస్ టీమ్ తో చేశారు. దానికి సంబంధించిన ప్రోమో మంగళవారం విడుదలైంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న సింగర్ శ్రీరామచంద్ర, యాంకర్స్ రవి, లోబో, కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్… ‘సర్కార్ 2’ షోకు హాజరయ్యారు. విశేషం ఏమంటే… శ్రీరామచంద్ర బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాగానే ‘ఆహా’ ఒరిజినల్ ప్రోగ్రామ్ ‘తెలుగు ఇండియన్ ఐడిల్’కు సైన్ చేశాడు. అతను హోస్ట్ గా తమన్, నిత్యామీనన్, కార్తీక్ న్యాయ నిర్ణేతలుగా ఈ కార్యక్రమం ప్రస్తుతం ఆహాలో ప్రసారం అవుతోంది. సో… ‘ఆహా’లోనే ఉన్న శ్రీరామచంద్రను మరోసారి ‘ఆహా’లోని తన షోకు ఆహ్వానిస్తున్నానని ప్రదీప్ తెలిపాడు. అలానే సినిమా మీద, చిరంజీవి మీద ఉన్న అభిమానాన్ని రవి మరోసారి చాటుకున్నాడు. ఇక లోబో అయితే తనదైన శైలిలో నవ్వులు జల్లులు కురిపించాడని ఈ ప్రోమో చూస్తుంటే అర్థమౌతోంది. మొత్తం మీద 13వ తేదీ శుక్రవారం ‘సర్కార్ 2’ మూడో ఎపిసోడ్ ప్రామిసింగ్ ఉండబోతోందనేది ప్రోమో చూస్తే తెలుస్తోంది.
https://www.youtube.com/watch?v=cL2eZ7ABWHU