నితిన్ హీరోగా ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లో తీవ్ర జాప్యం జరిగిన ఈ చిత్రాన్ని జూలై 8న విడుదల చేయబోతున్నట్టు గతంలో నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడా తేదీ ఆగస్ట్ 12కు మారింది. మూవీకి సంబంధించిన కొన్ని పనులు పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేయక తప్పలేదని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో […]
మహానటి సినిమాతో కీర్తి సురేశ్ కెరీర్ ఎలా మలుపు తిరిగిందో అందరికీ తెలుసు! అప్పటివరకూ అందరు హీరోయిన్లలాగే ఈమెను కన్సిడర్ చేసిన జనాలు.. మహానటి తర్వాత ఆ అందరి కంటే భిన్నంగా చూడడం మొదలుపెట్టారు. ఈమెపై ఎనలేని గౌరవం పెరిగింది. అలనాటి సావిత్రిని అచ్చుగుద్దినట్టు అద్భుత ప్రదర్శన కనబర్చడంతో.. ఈ తరం మహానటిగా కీర్తి గడించింది. ఇలా అనూహ్యమైన క్రేజ్ వచ్చినప్పుడు, ఎవ్వరైనా క్రేజీ ప్రాజెక్టులు చేయాలని అనుకుంటారు. కీర్తి కూడా అలాగే అనుకొని, తనకొచ్చిన ఫీమేల్-సెంట్రిక్ […]
ఆలిండియా స్టార్ ప్రభాస్ వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కే’ ఒకటి. ఎవడే సుబ్రమణ్యం, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా సై-ఫై జోనర్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో తాను ప్రభాస్‌ను ప్యాన్ వరల్డ్ స్టార్‌గా మారుస్తానని నాగ్ అశ్విన్ చెప్తున్న మాటల్ని బట్టి చూస్తే.. ఈ ప్రాజెక్ట్‌పై అతడు ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, బిగ్ బీ అమితాభ్ బచ్చన్ ఓ […]
తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. నెటిజన్ల విజ్ఞప్తులకు వెంటనే స్పందించడమే కాదు.. అప్పుడప్పుడు తానే ‘ఆస్క్ కేటీఆర్’ పేరిట ప్రజలతో ముచ్చటిస్తారు. వారి సమస్యల్ని తెలుసుకొని, అప్పటికప్పుడే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తారు. ఈరోజు కూడా ఆయన ట్విటర్‌లో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్ ఓ ప్రశ్న సంధించారు. తెలుగు వినోద రంగానికి ప్రపంచస్థాయి ఫిలిం స్కూల్/యూనివర్సిటీ అవసరం ఉందని, తద్వారా హైదరాబాద్‌ను భారతీయ చిత్ర రంగానికి […]
కథల ఎంపిక విషయంలో హీరోలందరూ దాదాపు తన సొంత నిర్ణయాలే తీసుకుంటారు. చుట్టుపక్కల వారి సలహాలు ఏమాత్రం తీసుకోరు. ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం ఉంటుంది కాబట్టి, నలుగుర్నీ అడిగితే నాలుగు విధానాల సమాధానాలు వస్తాయి. అప్పుడు ఆ ప్రాజెక్ట్ చేయాలా? వద్దా? అనే విషయంపై మరింత కన్ఫ్యూజన్ నెలకొంటుంది. అందుకే, సొంత నిర్ణయం మీదే కథానాయకులు ఆధారపడతారు. తానూ ఆ కోవకి చెందినవాడినేనని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. ‘‘ఫలక్‌నుమా దాస్, పాగల్ సినిమాల్లో ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ […]
కమెడియన్, సహాయ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన రాహుల్ రామకృష్ణ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే ట్విటర్ మాధ్యమంగా వెల్లడించాడు. తన కాబోయే భార్యకు లిప్‌లాక్ ఇచ్చిన ఫోటోను షేర్ చేస్తూ.. పెళ్ళి విషయాన్ని రాహుల్ ప్రకటించాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిజానికి.. రాహుల్ ప్యాండెమిక్‌కి ముందే తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ, అప్పుడు కుదరకపోవడంతో పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పరిస్థితులు […]
ఎఫ్2 (ఫన్ & ఫ్రస్ట్రేషన్)కి సీక్వెల్‌గా ఎఫ్3 సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే! దాదాపు ఆ సినిమాలో ఉన్న కాస్టింగే, ఇందులోనూ ఉంది. అదనపు ఆకర్షణగా సునీల్‌తో పాటు సోనాల్ చౌహాన్‌కి కూడా దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్నాడు. తొలి సినిమా కన్నా ఈ సీక్వెల్‌తో మరిన్ని నవ్వులు పూయించాలన్న అనిల్ పూనుకోవడమే కాదు, ఇది కచ్ఛితంగా డబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని నమ్మకంగా ఉన్నాడు కూడా! దాదాపు ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో, చిత్రబృందం […]
‘మదర్స్ డే’ని పురష్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి భూమ్మీద ఉండే అమ్మలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో తన తల్లి అంజనా దేవి, పవన్ కళ్యాణ్, నాగబాబులతో కలిసి ఉన్న ఒక వీడియోని షేర్ చేశారు. గతంలో ఓసారి గాడ్‌ఫాదర్, భీమ్లా నాయక్ చిత్రీకరణలు ఒకేసారి జరిగాయి. ఆ సమయంలో అంజనా దేవి, నాగబాబు లొకేషన్‌కు చేరుకొని.. సెట్‌లో కాసేపు గడిపారు. అందరూ కలిసి సెట్‌లోనే భోజనం చేశారు. చూడ్డానికి ఎంతో చూడమచ్చటగా ఉండే ఈ వీడియోను అందరినీ […]
తెలుగు ఇండియన్ ఐడిల్ 20 ఎపిసోడ్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ వారాంతంలో మదర్స్ డే ను పురస్కరించుకుని మెలోడీ బ్రహ్మ మణిశర్మను అతిథిగా ఆహ్వానించి, ఫ్యామిలీ స్పెషల్ ను ప్లాన్ చేశారు నిర్వాహకులు. తెలుగు ఇండియన్ ఐడిల్ జడ్జీల్లో ఒకరైన నిత్యా మీనన్ తనదైన శైలిలో మణిశర్మను ఈ ప్రోగ్రామ్ కు ఆహ్వానించగా, మిగిలిన ఇద్దరు న్యాయ నిర్ణేతలు తమన్, కార్తీక్ మణిశర్మతో పాటు కలిసి పాటకు స్టెప్పులేశారు. మణిశర్మ గెస్ట్ గా స్టేజ్ మీదకు […]
ప్రముఖ నటి పవిత్ర లోకేష్ దర్శకురాలిగా మారారు. రాజమండ్రి మహా కాళేశ్వరం దేవాలయం విశిష్టతను చాటుతూ ఆమె ఓ లఘు చిత్రం రూపొందించారు. విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ లో దీన్ని సీనియర్ నటుడు వీకే నరేశ్ నిర్మించారు. ఈ చిత్రంలో నరేష్, పవిత్ర లోకేష్, దేవాలయ ధర్మకర్త పట్టపాగుల వెంకట్రావు, ఎం. సి. వాసు తదితరులు నటించగా, శ్రీశ్రీపురం కిరణ్ రచన చేశారు. మోహన్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ లఘు చిత్రం సీడీని శనివారం హైదరాబాద్ […]