ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్ ఘోర ఓటమిని ఎదుర్కొంది. ముందుగా బ్యాటింగ్‌లో 127 పరుగులే చేసిన పాక్.. ఆపై బౌలింగ్‌లో కూడా దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ఘోర వైఫల్యం ఆ జట్టుపై ప్రభావం చూపింది. ప్రపంచంలో బెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన అఫ్రిది.. 16 ఓవర్లలో రెండు ఓవర్లే బౌలింగ్ చేయడం విశేషం. ఆ రెండు ఓవర్లలో ఏకంగా […]
తాడిపత్రిలో పోలీస్ భద్రతకు అయ్యే ఖర్చు చెల్లింపుపై వివాదం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసు భద్రతకు అయ్యే ఖర్చు చెల్లింపు వివాదం చెలరేగుతుంది. పోలీస్ భద్రతకు అయ్యే ఖర్చు పెద్దారెడ్డి నుంచి ఎందుకు వసూలు చేయడం లేదని తాడిపత్రి పట్టణ పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు. పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి నుంచి చలనా రూపంలో ఎటువంటి డబ్బులు కట్టించుకోలేదన్నారు. ఇంకా, పోలీసులు మాత్రం ముఖ్యమంత్రి స్థాయిలో బందోబస్తును కేతిరెడ్డికి కల్పిస్తూ.. అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం […]
భారత్ చేతిలో దాయాది పాకిస్థాన్‌కు మరోసారి ఓటమి తప్పలేదు. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ మరో 25 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ కనీస పోటీ కూడా ఇవ్వలేదు. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో […]
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను భారత్ బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్స్ సోషల్ మీడియాలో వచ్చాయి. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిల్ కూడా దాఖలైంది. ఇది కేవలం మ్యాచ్ మాత్రమే అని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. కేంద్రం కూడా వద్దని చెప్పలేదు. మరోవైపు ఐసీసీ, ఏసీసీ నిబంధనల మేరకే పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడుతున్నట్లు బీసీసీఐ కూడా తెలిపింది. ఎట్టకేలకు ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ […]
ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌పై సాధించిన విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులు, సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఉగ్రవాద దాడి బాధితు కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇదే సరైన సందర్భమని భావిస్తున్నా అని తెలిపాడు. బాధిత కుటుంబాలకు భారత జట్టు తరఫున సంఘీభావాన్ని తెలియజేస్తున్నామన్నాడు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు సూర్య ధన్యవాదాలు తెలిపాడు. భారతదేశానికి ఈ విజయం ఒక అద్భుతమైన రిటర్న్ […]
‘మిరాయ్’ సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని హీరోయిన్ రితికా నాయక్ చెప్పారు. విభా లాంటి అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారికి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారికి థాంక్యూ చెప్పారు. విభా చాలా స్పెషల్ క్యారెక్టర్ అని, తన మనసులో ఈ క్యారెక్టర్ ఎప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. మంచు మనోజ్ సర్ అద్భుత పెర్ఫార్మర్ అని, జీరో తేజ సజ్జా వెరీ డెడికేటెడ్ అని రితికా నాయక్ […]
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాడిని, కన్న పిల్లలను కూడా కాదనుకుంటున్నారు కొంత మంది మహిళలు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య సంచలనం కలిగిస్తున్నాయి. అంతే కాదు.. ప్రియుడి కోసం కట్టుకున్న వాడినో లేదా కన్న పిల్లలనో చంపేస్తున్నారు. చివరికి పోలీసు కేసులతో కటకటాలపాలవుతున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో లవర్ మోజులో పడి కూతురును కడతేర్చింది ఓ కసాయి తల్లి. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్ పల్లికి చెందిన బంటు మమత.. తన రెండేళ్ల కూతురిని […]
హైదరాబాద్ కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన రేణు అగర్వాల్ మర్డర్‌ను పోలీసులు ఛేదించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో నిందితులను అరెస్ట్ చేశారు. వారిద్దరి అరెస్ట్‌తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో కేసును ఛేదించారు పోలీసులు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో ఈ నెల10న రేణు అగర్వాల్ అనే మహిళను దారుణంగా చంపేశారు. ఇంట్లో వంట పని చేసే హర్ష, రోషన్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. హత్య తర్వాత […]
‘మిరాయ్’ చిత్రంకి అద్భుతమైన విజయాన్ని ఇచ్చి గుండెల్లో పెట్టి ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు హీరో తేజ సజ్జా. అభిమానుల సపోర్ట్ వల్లే తాను సినిమాలు చేయగలుగుతున్నా అని, మీవల్లే ఇక్కడ ఉండగలుగుతున్నా అని అన్నారు. సినిమా చూసిన ఆడియన్స్ సపరేట్గా రీల్స్ చేస్తూ.. మిరాయ్ సినిమా గురించి ప్రమోట్ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించిందన్నారు. మంచు మనోజ్ గారు ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమా మరో స్థాయికి వెళ్లిందన్నారు. కుర్రాళ్లని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే […]
ప్రస్తుతం తాను ఎంతో ఆనందంగా ఉన్నానని ‘రాకింగ్ స్టార్’ మంచు మనోజ్ తెలిపారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత వచ్చిన సక్సెస్‌తో తన ఫోన్ మోగుతూనే ఉందని ఎమోషనల్ అయ్యారు. అభినందనలు వస్తున్నప్పటికీ.. తనకు ఇదంతా ఓ కలలా ఉందని చెప్పారు. మిరాయ్ కథలో తనను భాగం చేసినందుకు డైరక్టర్ కార్తిక్ ఘట్టమనేనికి జన్మంతా రుణపడి ఉంటానన్నారు. కార్తిక్ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా నిలబెట్టారు అని చెప్పారు. తమ్ముడు తేజ సజ్జా మరింత గొప్ప […]