ప్రస్తుత రోజుల్లో పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయాన్ని గడపడం లేదని ‘సుప్రీం హీరో’ సాయి దుర్గా తేజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడంటే చాట్ జీటీపీ, ఏఐ అంటున్నారు కానీ.. అప్పుడైనా, ఇప్పుడైనా తనకు మాత్రం అమ్మే ప్రపంచం అని చెప్పారు. పిల్లలతో పేరెంట్స్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలని కోరారు. తన సెకండ్ క్లాస్‌లోని లవ్ స్టోరీని అమ్మతో చెప్పానని.. అలా పేరెంట్స్‌తో అన్ని విషయాల్ని పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలన్నారు. ప్రస్తుత రోజుల్లో మన పిల్లల్ని […]
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ఆహారంలో ‘ప్రోటీన్’ చాలా ముఖ్యం. కండరాల నిర్మాణం, ఎముకల పటిష్టం, హార్మోన్లు-ఎంజైమ్‌ల ఉత్పత్తి, జీవక్రియను మెరుగుపరచడానికి ప్రోటీన్స్ సహాయపడుతుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తిన్నప్పుడు శరీరం బాగుంటుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మన బాడీ తరచుగా అనారోగ్యంకు గురవుతుంది. అయితే బాలీవుడ్ నటి కరీనా కపూర్ డైటీషియన్, పోషకాహార నిపుణురాలు రుజుత దివేకర్ రోజువారీ ఆహారం ద్వారా ప్రోటీన్ లోపాన్ని ఎలా నివారించాలో వివరించారు. […]
Buy Xiaomi 14 Civi Dead Cheap in Amazon Great Indian Festival 2025: ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ 2025 త్వరలో ఆరంభం కానుంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ సేల్ ప్రారంభమవుతుంది. మీరు ప్రైమ్ మెంబర్ అయితే.. ఒక రోజు ముందుగానే సేల్కు యాక్సెస్ పొందుతారు. ఈ సేల్‌లో మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు కొన్ని ఫోన్స్ లభించనున్నాయి. ఆ జాబితాలో ఆకర్షణీయమైన, శక్తివంతమైన ‘షావోమీ 14 సీవీ’ […]
ప్రభుత్వం నుంచి ఎన్నో పన్ను మినహాయింపులను బీసీసీఐ పొందుతోందని వస్తున్న విమర్శలపై బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ‘బీసీసీఐ కూడా ఓ కార్పొరేట్ కంపెనీ లాగే పన్నులు చెల్లిస్తుంది. జీఎస్టీ కూడా కడుతోంది. మాకు ఎటువంటి మినహాయింపులు లేవు. మేము వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నాం. రాష్ట్ర సంఘాలు కూడా పన్నులు కడుతున్నాయి. మేము ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి గ్రాంట్ కూడా తీసుకోము’ అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. […]
ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు ప్రదర్శించిన పెను ఉన్మాదానికి 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో కాన్పుర్‌కు చెందిన వ్యాపారి శుభమ్ ద్వివేది కూడా ఉన్నారు. తన సతీమణి ఐషాన్య ద్వివేదితో కలిసి హనీమూన్ కోసం కశ్మీర్‌కు వెళ్లిన శుభమ్‌ను బైసరన్ లోయలో ఉగ్రవాదులు తలపై కాల్చి చంపారు. అప్పటినుంచి ఇషానాయ్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆసియా కప్ 2025లో […]
భారత జట్టు మాజీ స్పిన్నర్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్ టీమిండియాలో మరోసారి కీలక పాత్ర పోషించనున్నాడా? అంటే.. అవుననే సమాధానాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా హర్భజన్ ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇందుకు తాజాగా పంజాబ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం కూడా బలం చేకూరుస్తోంది. ఏజీఎంలో తమ ప్రతినిధిగా భజ్జీని పంజాబ్ నామినేట్ చేసింది. ఈ నెల చివరలో జరిగే ఏజీఎంకు పంజాబ్ తరఫున అతడు హాజరవుతాడు. సెప్టెంబర్ […]
ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో మ్యాచ్ ఆడొద్దని భారత ఫాన్స్ మండిపడుతున్నారు. బాయ్‌కాట్ ఆసియా కప్ 2025, బాయ్‌కాట్ భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఐసీసీ, ఏసీసీ నిబంధనల మేరకు ఆడుతున్నామని బీసీసీఐ పెద్దలు చెప్పుకొస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు కూడా అది కేవలం అట మాత్రమే అని పేర్కొంది. అయినా కూడా అభిమానుల్లో ఆగ్రహం […]
ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్, ఒమన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 రన్స్ చేసింది. మహ్మద్ హారిస్ (66; 43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (29), ఫకార్ జమాన్ (23) మినహా అందరూ విఫలమయ్యారు. ఓపెనర్ సైమ్ అయూబ్డకౌట్ అయ్యాడు. కెప్టెన్ సల్మాన్ అఘా […]
ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పవర్‌హౌస్ అభిషేక్ శర్మ రెచ్చిపోయిన విషయం తెలిసిందే. 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 30 రన్స్ చేశాడు. చేసిన 30 పరుగులలో 26 రన్స్ బౌండరీల ద్వారానే వచ్చాయి. ఎలాంటి బెరుకు లేకుండా ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్స్ కొట్టాడు. అభిషేక్ బ్యాటింగ్‌పై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. దాయాది పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ కూడా అభిషేక్ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యాడు. […]
బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి వెలుపల కాల్పులు జరిగాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీలోని సివిల్ లైన్స్‌లోని ఉన్న దిశా పటానీ ఇంటి వెలుపల గురువారం అర్థరాత్రి పలు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో రెండు రౌండ్ల వైమానిక కాల్పులు జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దిశా సోదరి ఖుష్బూ పటాని […]