IND vs PAK: పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌కు పాక్ కెప్టెన్ డుమ్మా.. డ్రెస్సింగ్ రూమ్‌లో దాక్కొని!
- భారత్ చేతిలో పాకిస్థాన్‌కు మరోసారి ఓటమి తప్పలేదు
- కనీస పోటీ కూడా ఇవ్వని పాకిస్థాన్
- పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌కు పాక్ కెప్టెన్ డుమ్మా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ చేతిలో దాయాది పాకిస్థాన్‌కు మరోసారి ఓటమి తప్పలేదు. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ మరో 25 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ కనీస పోటీ కూడా ఇవ్వలేదు. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమై భారీ మూల్యం చెల్లించుకుంది. దారుణ ఓటమి నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా ఏకంగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌కు డుమ్మా కొట్టాడు.
భారత్‌తో మ్యాచ్‌కు ముందు తాము ఎవరినైనా ఓడిస్తామని గొప్పలు చెప్పుకున్న సల్మాన్ అఘా.. ఓటమి తర్వాత కనీసం ప్రెజెంటేషన్‌లో మాట్లాడేందుకు కూడా రాలేదు. ఓటమి బాధలో ఉన్న అతడు నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల కెప్టెన్స్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పాల్గొనడం సంప్రదాయం. కానీ పాక్ కెప్టెన్ దారుణ ఓటమిని జీర్ణించుకోలేక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌కు డుమ్మా కొట్టాడు. ‘ప్రెజెంటేషన్‌కు డుమ్మా కొట్టి డ్రెస్సింగ్ రూమ్‌లో దాక్కొన్నాడు’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ కోచ్ మైక్ హెసెన్ స్పదించాడు. అనుకోకుండా అలా జరిగిపోయిందని కవర్ చేశాడు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
Also Read: IND vs PAK: పాకిస్థాన్ మ్యాచ్‌లో ప్రత్యేకమైన నిరసన.. శభాష్ సూర్యకుమార్!
‘కెప్టెన్ సల్మాన్ అఘా ప్రెజెంటేషన్‌లో మాట్లాడలేదు. అది అనుకోకుండా జరిగిపోయింది. మ్యాచ్ అనంతరం మేము కరచాలనం చేయాలని భావించాం. అందుకు అందరం సిద్ధమయ్యాం. కానీ భారత్ అందుకు అంగీకరించలేదు. భారత్ ప్లేయర్స్ అందరూ నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. ఇలా మమ్మల్ని చాలా నిరుత్సాహపరిచింది. ఈ మ్యాచ్‌లో మా ఆట ఏమాత్రం బాగోలేదు. అన్ని విభాగాల్లో తేలిపోయాం. చాలా నిరాశగా ఉంది. ప్లేయర్స్ అందరూ నిరుత్సాహంగా ఉన్నారు’ అని పాక్ కోచ్ మైక్ హెసెన్ చెప్పాడు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!