ఆసియా కప్ 2025లో గ్రూప్-ఎ నుంచి సూపర్-4 చేరాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో పాక్ గెలిచింది. ఈ విజయంతో పాకిస్థాన్ సూపర్-4కు చేరుకుంది. గ్రూప్-ఎ నుంచి భారత్ ఇప్పటికే సూపర్-4కు చేరుకుంది. కీలక సమయంలో వికెట్లు కోల్పోయిన యూఏఈ పరాజయం పాలైంది. లేదంటే ఆతిథ్య యూఏఈ సంచలనం సృష్టించేదే. గ్రూప్-ఎ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్థాన్, యూఏఈల మధ్య […]
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, కృష్ణానగర్, సనత్ నగర్, మియాపూర్, చందనాగర్, కేపీహెచ్‌బీ, సుచిత్ర, ఏఎస్రావు నగర్.. తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. భారీ వర్షానికి రహదారులు అన్నీ జలమయమయ్యాయి. మోకాలి లోతు వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉద్ధృతంగా ప్రవహిహిస్తున్న వరద నీటిలో కొట్టుకుపోయి ఓ యువకుడు మృతి చెందాడు. బల్కంపేట్‌లోని […]
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే హోరాహోరీగా పోరు ఉంటుంది. ప్రతిక్షణం ఆటగాళ్లలో కసి, అభిమానుల్లో ఎంతో ఆసక్తి, బంతి బంతికి మలుపులు, పతాక స్థాయిలో భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇవేమీ కనిపించలేదు. ఇండో-పాక్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. భారత్ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తూ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ చూసిన వారికి కాస్త నిరాశే ఎదురైంది. మ్యాచ్ చప్పగా సాగడంతో […]
కోవిడ్ మహమ్మారి అనంతరం ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. చాలా మంది మంచి ఆహరం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కూరగాయలు, మాంసంతో పాటుగా పండ్లను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యం కోరుకున్నట్లతే.. మీ ఇంటి గార్డెన్లో ఈ 5 పండ్ల చెట్లను నాటుకుంటే సరిపోతుంది. నాటిన చెట్లు కాస్త పెద్దయ్యాక మీరు పండ్లు కొనడానికి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీరు గార్డెన్‌లోనే తాజా పండ్లను కోసుకోవచ్చు. దాంతో ఆరోగ్యంతో పాటు […]
ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ స్టార్ పేస్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది బౌలింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 11.50 ఎకానమీతో 23 రన్స్ ఇచ్చాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ దెబ్బకు షాహిన్ భారీగా రన్స్ ఇచ్చి.. వికెట్లేమీ తీయలేదు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం 16 బంతుల్లోనే 33 పరుగులు […]
ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా.. ఈ మ్యాచ్ తర్వాత పాక్ ఆటగాళ్లతో టీమిండియా క్రికెటర్లు కరచాలనం చేయలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిబంధనలు ఉల్లంఘించాడని, ఆయన్ను టోర్నీ నుంచి తొలగించాలని ఆసియా క్రికెట్ సంఘం (ఏసీసీ)కి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీని తొలగించకుంటే.. టోర్నీని బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించింది. ఈ విషయంపై ఐసీసీని ఏసీసీ సాయం కోరింది. Also Read: Kribhco Chairman: […]
క్రిబ్కో (క్రిషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్) నూతన ఛైర్మన్‌గా తెలుగు వ్యాపారవేత్త వల్లభనేని సుధాకర్ చౌదరి ఎన్నికయ్యారు. మొన్నటివరకు వైస్ ఛైర్మన్‌గా ఉన్న సుధాకర్ చౌదరి.. సోమవారం జరిగిన క్రిబ్కో ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలానే డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్ వైస్ ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఈ రెండు అత్యున్నత పదవులకు ఒకే నామినేషన్లు దాఖలు కావడంతో.. ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. నూతన ఛైర్మన్ సుధాకర్ చౌదరికి ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. […]
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’కు భారతదేశంలో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ దృష్టా వసరుసగా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఐఫోన్ 17 సిరీస్‌కు పోటీగా వన్‌ప్లస్ 15ను రిలీజ్ చేసేందుకు కంపెనీ సిద్దమైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో చైనాలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ తాజాగా లీక్ అయ్యాయి. ఈ ఫోన్ డిజైన్ అద్భుతంగా ఉంది. లీకైన కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ వివరాలు ఏంటో […]
వర్షాకాలంలో పాములు బయటకు రావడం సర్వసాధారణం. వర్షపు చుక్కలు భూమిపై పడగానే.. భూమి లోపల దాగి ఉన్న అనేక జీవులు బయటకు వస్తాయి. వర్షం పడగానే ఎక్కువగా పాములను మనం చూస్తాం. పొలాలు, పశువుల షెడ్స్, రోడ్లు, వీధులతో సహా కొన్నిసార్లు ఇళ్లలో పాములు ఉండటం చూసి ప్రజలు భయపడతారు. తెలియకుండా వాటిపై అడుగు వేస్తే అవి కాటేస్తాయి. పాములలో కొన్ని విషపూరితమైనవి ఉండగా.. మరికొన్ని విషరహితమైనవి కూడా ఉన్నాయి. ప్రతి పాము విషపూరితమైనదని, అది కరిస్తే […]
బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో ఐఫోన్ 16 సిరీస్‌పై ఇప్పటికే భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. తాజాగా కొనుగోలుదారులకు ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లను ముందస్తుగా రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. ఇందుకు ‘ప్రీ-రిజర్వ్ పాస్’ను ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చింది. పాస్ కొనుగోలు చేసిన వారు సేల్‌లో మొదటి 24 గంటల్లో ప్రో, ప్రో మాక్స్‌లను పొందవచ్చు. ఐఫోన్‌కు ఫుల్ క్రేజ్ కారణంగానే ఈ ఫ్లిప్‌కార్ట్ దీనిని ప్రవేశపెట్టింది. అంతేకాదు డిస్కౌంట్స్ […]