Manchu Manoj: 12 ఏళ్ల తర్వాత సక్సెస్.. కలలా ఉందంటూ మంచు మనోజ్ ఎమోషనల్!
- తేజ సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రల్లో మిరాయ్
- అంచనాలకు మించి విజయం సాధించిన మిరాయ్
- సక్సెస్‌తో ఫోన్ మోగుతూనే ఉందంటూ మనోజ్ ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తాను ఎంతో ఆనందంగా ఉన్నానని ‘రాకింగ్ స్టార్’ మంచు మనోజ్ తెలిపారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత వచ్చిన సక్సెస్‌తో తన ఫోన్ మోగుతూనే ఉందని ఎమోషనల్ అయ్యారు. అభినందనలు వస్తున్నప్పటికీ.. తనకు ఇదంతా ఓ కలలా ఉందని చెప్పారు. మిరాయ్ కథలో తనను భాగం చేసినందుకు డైరక్టర్ కార్తిక్ ఘట్టమనేనికి జన్మంతా రుణపడి ఉంటానన్నారు. కార్తిక్ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా నిలబెట్టారు అని చెప్పారు. తమ్ముడు తేజ సజ్జా మరింత గొప్ప స్థాయికి వెళ్తాడు అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా మిరాయ్. నిన్న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా.. అంచనాలకు మించి విజయం సాధించింది. దాంతో రాకింగ్ స్టార్ ఆనందంలో మునిగిపోయారు.
మిరాయ్ చిత్ర యూనిట్ నేడు సక్సెస్ మీట్ నిర్వహించింది. సక్సెస్ మీట్‌లో మంచు మనోజ్ మాట్లాడుతూ… ‘ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. 12 ఏళ్ల తర్వాత సక్సెస్ వచ్చింది. నిన్నటి నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. పెద్ద పెద్ద వారి అభినందనలు వస్తున్నప్పటికీ.. నాకు ఇదంతా ఓ కలలా ఉంది. మిరాయ్ కథలో నన్ను భాగం చేసిన డైరక్టర్ కార్తిక్‌కు జన్మంతా రుణపడి ఉంటా. ఇంతకుముందు నేను ఎక్కడికి వెళ్లినా ‘అన్నా సినిమా ఎప్పుడు, కమ్‌బ్యాక్ ఎప్పుడు?’ అని అడిగేవారు. త్వరలోనే వస్తానని చెప్పేవాడిని. బయటకు ధైర్యంగా మాట్లాడినా.. లోపల ఎదో తెలియని భయం ఉండేది. ఆ సమయంలో కార్తిక్ నన్ను కలవడం అదృష్టం. అతడు నన్ను మాత్రమే నిలబెట్టలేదు, నాతో పాటు నా కుటుంబాన్ని కూడా నిలబెట్టారు’ అని చెప్పారు.
Also Read
- Notifciation Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
‘నేను పెరిగినట్లు నా పిల్లల్ని పెంచగలనా? అని భయపడుతూ ఉండేవాడిని. ఆ భయాన్ని కార్తిక్ తొలగించారు. నిర్మాత విశ్వప్రసాద్ గారి పాషన్‌కి హ్యాట్సప్. అద్భుతంగా ఈ సినిమాని నిర్మించారు. తమ్ముడు తేజ మరింత గొప్ప స్థాయికి వెళ్తాడు. రితిక అద్భుతంగా నటించారు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది. నా చిన్ననాటి క్యారెక్టర్ చేసిన ఇద్దరు కూడా బాగా చేశారు. గౌరీ హర గారు సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా డైరెక్టర్ గారికి హాట్సాఫ్. శ్రీకర్ ప్రసాద్ గారితో కలిసి వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రతి ఇంట్లో నుంచి మనోజ్ గెలవాలి అని కోరుకున్న వారందరికీ పాదాభివందనం. నామీద నమ్మకం పెట్టుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇకపై వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్లాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’ అని మంచు మనోజ్ తెలిపారు.
తాజావార్తలు
-
Notifciation Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!