అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 23 నుంచి సేల్ ప్రారంభమవుతోంది. ప్రైమ్ సబ్స్రైబర్లు ఒక రోజు ముందే సేల్ అందుబాటులోకి వస్తుంది. అయితే ‘సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ’పై ఆఫర్ కోసం మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫోన్ అమెజాన్‌లో అత్యల్ప ధరకు అందుబాటులో ఉంది. ఈ సామ్సంగ్ ఫోన్ గత సంవత్సరం భారతదేశంలో రూ.59,999కి రిలీజ్ అయింది. ఇప్పుడు బ్యాంక్ ఆఫర్లతో […]
యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025లో ‘కరచాలనం’ వివాదం నడుస్తోంది. ఆదివారం (సెప్టెంబర్ 14) మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్స్ కరచాలనం చేయడానికి తిరస్కరించడమే ఈ వివాదానికి కారణం. పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపడం కోసమే ఇలా చేశామని భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫైర్ అయింది. ఇందుకు బాధ్యుణ్ని చేస్తూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ […]
ఆసియా కప్ 2025లో భారత్ సూపర్-4కు చేరుకుంది. గ్రూప్-ఎ నుంచి సూపర్-4లో చోటు ఖాయమైంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమవారం భారత్‌కు మ్యాచ్ లేదు కానీ.. ఒమన్‌ను యూఏఈ ఓడించడంతో టోర్నీలో సూపర్-4 చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఎ నుంచి సూపర్-4కు అర్హత సాధించడానికి ఇంకా ఒక జట్టుకే అవకాశం ఉంది. […]
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా దాయాది పాకిస్థాన్‌తో ఆసియా కప్ 2025లో భారత్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ ఇండియన్ ఫాన్స్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. అయితే ఐసీసీ, ఏసీసీ నిబంధనల ప్రకారం పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడక తప్పలేదు. మ్యాచ్ విజయంను పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితం చేస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. మ్యాచ్ సాయంలో, పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పాక్ ప్లేయర్లతో భారత ఆటగాళ్లు కరచాలనం చేయకుండా ఉండడంపై ఫాన్స్ హర్షం […]
ఆదివారం (సెప్టెంబర్ 14) దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని ఇండియన్ ఫాన్స్ డిమాండ్ చేశారు. ఐసీసీ, ఏసీసీ నిబంధనల మేరకు పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడాల్సిందే అని బీసీసీఐ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. ఈ నేపథ్యంలో టాస్ సమయంలో, మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ […]
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా దాయాది పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడొద్దని భారత అభిమానులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆసియా కప్ 2025లో భాగంగా నవంబర్ 14న దుబాయ్ వేదికగా మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ‘బాయ్‌కాట్ ఆసియా కప్ 2025’, ‘బాయ్‌కాట్ భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్’ అని ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఐసీసీ, ఏసీసీ నిబంధనలకు లోబడి మ్యాచ్ ఆడాల్సిందే అని బీసీసీఐ స్పష్టం చేసింది. బాయ్‌కాట్ ట్రెండ్ నేపథ్యంలో ఇండో-పాక్ మ్యాచ్‌కు […]
టీమిండియా బ్యాటర్ రజత్ పటీదార్ తన కెప్టెన్సీ మాయను మరోసారి చూపాడు. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను విజేతగా నిలిపిన పటీదార్.. దేశవాళీ క్రికెట్లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ 2025లో సెంట్రల్ జోన్‌కు టైటిల్ అందించాడు. ఫైనల్లో సౌత్ జోన్ నిర్దేశించిన 65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సెంట్రల్ జోన్ ఏ వికెట్లను కోల్పోయి ఛేదించింది. పటీదార్ నాయకత్వంలో వరుసగా రెండో టైటిల్‌ను సెంట్రల్ జోన్ గెలిచింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ […]
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే.. హోరాహోరీ పోరు, ఆటగాళ్లలో కసి, అభిమానుల్లో ఎంతో ఆసక్తి, పతాక స్థాయిలో భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో ఇవేమీ కనిపించలేదు. దుబాయ్ స్టేడియంలో పాక్ అభిమానుల సందడి కాసేపు కనిపించినా.. ఆ తర్వాత అది కూడా కనిపించకుండా పోయింది. పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కారణంగా ఫాన్స్ నిరాశలో కనిపించారు. భారత్ చేతిలో ఓటమి అనంతరం […]
ఇటీవలి రోజుల్లో వరుసగా పెరిగిన బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకిన విషయం తెలిసిందే. తులం బంగారం లక్షా 10 వేల పైనే ఉంది. అయితే పసిడి ప్రియులకు ఊరటనిస్తూ.. గోల్డ్ రేట్లు స్వల్పంగా దిగొచ్చాయి. శనివారం స్వల్పంగా తగ్గిన పసిడి.. నేడు కూడా స్వల్పంగానే తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100, 24 క్యారెట్లపై రూ.110 తగ్గింది. బులియన్ మార్కెట్లో సోమవారం (సెప్టెంబర్ 15) 22 క్యారెట్ల 10 గ్రాముల […]
ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ముంగిట ఓ బిగ్ మిస్టేక్ చోటుచేసుకుంది. క్రికెట్ ఆటలో మ్యాచ్ ఆరంభానికి ముందు రెండు జట్ల ఆటగాళ్లు.. తమ తమ జాతీయ గీతాలు ఆలపించడం ఆనవాయితీ. ఇండో-పాక్ మ్యాచ్‌లో ముందుగా పాకిస్థాన్ జాతీయ గీతం మొదలు కావాల్సి ఉంది. అయితే డీజే ఆపరేటర్ పొరపాటుగా పంజాబీ-ఇంగ్లిష్ పాప్ సాంగ్ ‘జలేబీ బేబీ’ని ప్లే చేశాడు. దాంతో పాక్ […]