KTR Tweet Goes Viral: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే 42 స్థానాలు గెలిచిన కాంగ్రెస్.. మరో 22 చోట్ల ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 60కి కాంగ్రెస్ దగ్గరలో ఉండగా.. అధికార బీఆర్ఎస్ కేవలం 13 స్థానాల్లో మాత్రమే గెలిచి ఓటమి దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ తమ ఓటమిని ఒప్పుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ […]
Malreddy Ranga Reddy Won From Ibrahimpatnam: తన విజయాన్ని ఇబ్రహీంపట్నం ప్రజలకు అంకితం చేస్తున్నా అని కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఆరు పథకాలు ప్రతి నిరుపేద కుటుంబానికి అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై మల్రెడ్డి రంగారెడ్డి గెలిచారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో ఆయనను ఇబ్రహీంపట్నం అభ్యర్థిగా ప్రకటించింది. విజయం అనంతరం ఎన్టీవీతో మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ […]
ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసులు: నాగార్జున సాగర్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాగర్ నీటి కోసం ఏపీ, తెలంగాణ పోలీసుల వివాదం తారాస్థాయి చేరుతున్నాయి. ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు మేరకు విజయపురి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులతో పాటు రాష్ట్రంలోని నీటిపారుదల అధికారులపై తెలంగాణ ఎస్పీఎఫ్ను ప్రయోగించారు. అర్థరాత్రి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని, ఏపీ పోలీసులు అనుమతి లేకుండా డ్యాం వద్దకు […]
Bank holidays in December 2023: ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో పెరిగినా.. కొన్ని పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే బ్యాంకుకు వెళ్లేముందు సెలవుల జాబితాను చెక్ చేసుకోకుండా పొతే.. మీ సమయం వృధా అవుతుంది. ఈ నేపథ్యంలోనే కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రతి నెలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. 2023 డిసెంబర్లో […]
Actress R Subbalakshmi Passed Away: సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి సుబ్బలక్ష్మి కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బలక్ష్మి.. కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు సౌభాగ్య సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సుబ్బలక్ష్మి మృతితో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలువురు సినీ ప్రముఖులు ఆమె […]
8 Killed in Odisha Road Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కెందుజార్‌లో శుక్రవారం ఉదయం 5 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. 20వ నంబర్ జాతీయ రహదారి బలిజోడి సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యాన్ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. […]
Terrorist killed in Pulwama encounter: భారత సరిహద్దులో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం సరిహద్దు ప్రాంత ప్రజలపై ఉగ్రదాడి కుట్రకు పాల్పడాలని చూసిన వారి పథకాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. గురువారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. పుల్వామాలో గత రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ స్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి. Also Read: IND vs SA: టీమిండియా కెప్టెన్‌గా కేఎస్ భరత్! అధికారులు తెలిపిన […]
KS Bharat named captain for South Africa Tour: దక్షిణాఫ్రికా పర్యటన కోసం గురువారం బీసీసీఐ సెలెక్టర్లు జట్లను ప్రకటించారు. భారత సీనియర్ జట్టుతో భారత్-ఏ జట్టు కూడా దక్షిణాఫ్రికాలో పర్యటనలో భాగం కానుంది. ఈ పర్యటనలో భారత్-ఏ జట్టు దక్షిణాఫ్రికా-ఏతో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. మరోవైపు సీనియర్ జట్టుతో ఓ ఇన్ట్రా స్క్వాడ్ మ్యాచ్ కూడా ఆడుతుంది. భారత్-ఏ జట్టుకు ఆంధ్ర వికెట్‌కీపర్, టీమిండియా ఆటగాడు కేఎస్ భరత్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. […]
Shane Dowrich retires from international cricket: వెస్టిండీస్ కీపర్ షేన్ డౌరిచ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ఇంగ్లండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో 32 ఏళ్ల డౌరిచ్‌కు చోటు లభించినప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాడు. దాంతో ఇంగ్లండ్ సిరీస్ ఆడకుండానే.. డౌరిచ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. డౌరిచ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పట్ల విండీస్ […]
దుర్గం చిన్నయ్య పై కేసు నమోదు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై నెన్నెల పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేసేందుకు బీఆర్ఎస్ కండువాతో ఎమ్మెల్యే వెళ్లారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ వోజ్జల రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పుకుని పోలింగ్ బూత్‌లోకి వెళ్లడం కనిపించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని […]