Bank Holidays: డిసెంబర్లో 18 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి జాబితా ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank holidays in December 2023: ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో పెరిగినా.. కొన్ని పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే బ్యాంకుకు వెళ్లేముందు సెలవుల జాబితాను చెక్ చేసుకోకుండా పొతే.. మీ సమయం వృధా అవుతుంది. ఈ నేపథ్యంలోనే కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రతి నెలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది.
2023 డిసెంబర్లో బ్యాంకులకు ఏకంగా 18 రోజులు సెలవులు ఉన్నాయి. ఐదు ఆది వారాలు.. రెండో, నాలుగో శని వారాలతో కలిపి ఈ నెలలో18 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇందులో ఆర్బీఐ హాలిడే లిస్టుతో పాటు ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ నెలలో బ్యాంకులకు 8 రోజులు సెలవులు ఉన్నాయి. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయన్న విషయం తెలిసిందే.
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
Also Read: Subbalakshmi Died: సీనియర్ నటి సుబ్బలక్ష్మి కన్నుమూత!
డిసెంబర్‌లో బ్యాంక్ సెలవులు (2023 December Bank Holidays List):
డిసెంబర్ 1 : రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇటానగర్, కోహిమా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 3: ఆదివారం సెలవు
డిసెంబర్ 4: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ కారణంగా పనాజీలో సెలవు
డిసెంబర్ 9: రెండో శనివారం సెలవు
డిసెంబర్ 10: ఆదివారం సెలవు
డిసెంబర్ 12: లాసంగ్/పా టోగాన్ నెంగ్‌మింజా సంగ్మా షిల్లాంగ్‌లో సెలవు
డిసెంబర్ 13, 14: లోసంగ్/ పా తోగన్ కారణంగా గాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 17: ఆదివారం సెలవు
డిసెంబర్ 18: యు సో సో థామ్ వర్ధంతి కారణంగా షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 19: గోవా విమోచన దినోత్సవంతో పనాజీలో సెలవు
డిసెంబర్ 23: నాలుగో శనివారం
డిసెంబర్ 24: ఆదివారం సెలవు
డిసెంబర్ 25: క్రిస్మస్ కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేత
డిసెంబర్ 26: ఐజ్వాల్, కొహిమా, షిల్లాంగ్‌లలో క్రిస్మస్ సెలవు
డిసెంబర్ 27: క్రిస్మస్ కారణంగా కోహిమాలోని బ్యాంకులు మూసివేత
డిసెంబర్ 30: యు కియాంగ్ కారణంగా షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 31: ఆదివారం సెలవు
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!