8 Killed in Odisha Road Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కెందుజార్‌లో శుక్రవారం ఉదయం 5 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. 20వ నంబర్ జాతీయ రహదారి బలిజోడి సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యాన్ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
Also Read: Pulwama Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం!
గంజాం జిల్లాకు చెందిన రెండు కుటుంబ సభ్యులు తారిణి దేవి ఆలయ దర్శనానికి వెళ్తుండగా.. రోడ్డు పక్కన ఆగివున్న లారీని జీపును ఢీ కొట్టింది. తారిణి ఆలయానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన 12 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని కటక్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని కెందుజార్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేర్చారు. మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.