Malreddy Ranga Reddy Won From Ibrahimpatnam: తన విజయాన్ని ఇబ్రహీంపట్నం ప్రజలకు అంకితం చేస్తున్నా అని కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఆరు పథకాలు ప్రతి నిరుపేద కుటుంబానికి అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై మల్‌రెడ్డి రంగారెడ్డి గెలిచారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో ఆయనను ఇబ్రహీంపట్నం అభ్యర్థిగా ప్రకటించింది.
విజయం అనంతరం ఎన్టీవీతో మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా కష్టమే నన్ను గెలిపించింది. ఈ విజయాన్ని ఇబ్రహీంపట్నం ప్రజలకు అంకితం చేస్తున్నా. కాంగ్రెస్ ఆరు పథకాలు ప్రతి నిరుపేద కుటుంబానికి అందేలా చూస్తా. ఇబ్రహీంపట్నం అభివృద్ధి నా ధ్యేయం. అధిష్టానం నాకు ఖచ్చితంగా మంత్రి పదవిని ఇస్తుందని ఆశిస్తున్నా’ అని మల్‌రెడ్డి రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.