Sampath Kumar
Author- NTV Telugu-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
Virat Kohli Eyes Sachin Tendulkar’s Rare Records: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరలా రికార్డుల వేటకు సిద్ధమయ్యాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఈరోజు తిరువనంతపురంలో జరగనున్న తొలి వన్డేలో బరిలోకి దిగనున్న కింగ్.. ఒకేసారి నాలుగు భారీ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేయనున్నాడు. ఆ రేర్ రికార్డులు ఏంటో ఓసారి చూద్దాం. […] -
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
Dhruv Jurel praises Vaibhav Suryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌తో కలిసి ఆడటం ఎలా అనిపిస్తుందని అడిగిన ప్రశ్నకు జురెల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 15 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడని ప్రశంసించాడు. అతడిని చూసి తామంతా ఆశ్చర్యపోతుంటాం అని చెప్పాడు. అందరి ప్రశంసలకు వైభవ్ పూర్తి అర్హుడు అని పేర్కొన్నాడు. అయితే వైభవ్‌పై తనకు ఎలాంటి జెలసీ […] -
Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
విజయవాడ గాంధీనగర్‌లోని ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టేందుకు సచివాలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే అక్కడే బైఠాయించి సచివాలయ ఉద్యోగులు నిరసన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వం తీరుపై సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల […] -
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం వెలగపల్లి ప్రాంతంలో గిరిజనుల కష్టాలు మరోసారి వెలుగుచూశాయి. సీతపల్లి వాగుపై వంతెన లేకపోవడంతో గ్రామస్తులు ప్రాణాలను పణంగా పెట్టి తాడు సహాయంతో వాగు దాటుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో చిన్నారులను కూడా ఇదే విధంగా తరలించాల్సిన దుస్థితి నెలకొంది. దేవీపట్నం మండలం వెలగపల్లి సమీపంలోని సీతపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో లక్ష్మీపురం, గుంపెనపల్లి గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగుపై వంతెన లేకపోవడంతో తాడు సహాయంతోనే వాగును దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. […] -
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
Chintur Agency Rains Update: పోలవరం జిల్లాలోని చింతూరు ఏజెన్సీలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతోంది. శబరి, గోదావరి నదుల్లో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఇళ్లు, పశువులు, పంటలకు జరిగిన నష్టాలపై 24 గంటల్లో సమగ్ర నివేదిక అందజేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చింతూరు ఏజెన్సీలో గత కొన్ని […] -
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
IND vs WI 1st ODI Live Streaming and Head-to-Head Details: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఆదివారం (సెప్టెంబర్ 27) తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు ఉండటంతో తొలి వన్డేపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జులైలో ఇంగ్లాండ్‌లో వన్డేలు ఆడిన తర్వాత […] -
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
Sunday Horoscope September 27 2026: మిథున రాశి వారు దైవ సంబంధమైన కార్యక్రమాలను రూపొందిస్తారు. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటూ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారు, పరిచయాలను ఉపయోగించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. పరమేశ్వరుడు. శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించాలి. మీన రాశి వారు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగపరమైన ఇబ్బందులను అధిగమిస్తారు. ఒప్పుకోలు (అగ్రిమెంట్లు) చేసుకునే సమయంలో తొందరపాటు పనికిరాదు. లలితా పంచరత్న స్తోత్రం పారాయణం చేస్తే మంచింది. […] -
AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
AP Excise Policy 2026-27: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ 2026-27 అమలుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మొత్తం 3,736 మద్యం దుకాణాల్లో 2,929 దుకాణాల రెన్యూవల్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 807 మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా కేటాయింపు చేపట్టనున్నారు. ఇందులో 799 దుకాణాలను ఓపెన్ కేటగిరీలో, మరో 8 దుకాణాలను రిజర్వుడ్ కేటగిరీలో కేటాయించేందుకు ప్రభుత్వం […] -
Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
Heavy Rains in East Godavari: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. గ్రామాలు, పంట పొలాలు, రహదారులు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తుండగా.. ఒక మహిళ వరద ప్రవాహంలో గల్లంతైంది. మరోవైపు వందల ఎకరాల్లో వరి పంట ముంపునకు గురై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. […] -
Yanamala Krishnudu: తుని రాజకీయాల్లో కీలక పరిణామం.. జనసేనలో చేరిన యనమల కృష్ణుడు!
Yanamala Krishnudu Joins Janasena: తుని రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నేత యనమల కృష్ణుడు జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కృష్ణుడు జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా తుని రాజకీయ వర్గాల్లో కొనసాగగా.. తాజాగా అది కార్యరూపం దాల్చింది. యనమల కృష్ణుడు గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తుని […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..