అల్లూరి ఏజెన్సీలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏజెన్సీ వ్యాప్తంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో జిమాడుగుల, అరకు, మినుములూరు వద్ద మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరు, ముంచింగి పుట్టు, పెదబయలు ప్రాంతాల్లో 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దాంతో అల్లూరి ఏజెన్సీలోని ప్రజలు చలికి వణుకుతున్నారు. పిల్లలు, వృద్దులు బయటికి రావాలంటే బయపడిపోతున్నారు.
అల్లూరి ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెల్లవారుజామున భారీగా మంచు కురుస్తోంది. చలి తీవ్రతకు ఆపి ఉంచిన వాహనాల అద్దాలపై మంచు గడ్డకడుతోంది. చలి తీవ్రతకు రోడ్ల పక్కన చలి మంటలు వేసుకుంటూ.. చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు జనాలు. మరో వారం రోజులు పాటు చలి తీవ్రత ఇలానే కొనసాగుతుందంటూ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంచు కురుస్తున్న నేపథ్యంలో తెల్లవారుజామున ప్రయాణాలు చొయ్యొద్దని హెచ్చరించారు. భారీ మంచు కారణంగా తెల్లవారుజామున పక్కనున్న వ్యక్తి కూడా కనబడడం లేదని ఏజెన్సీ వాసులు అంటున్నారు.
Also Read: Padmavathi Temple: అనధికారికంగా ఆలయంలో విధులు.. నేడు ఉన్నతాధికారులకు విజిలెన్స్ రిపొర్టు!
మరోవైపు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోతున్నాయి. డిసెంబర్ 7 నుంచి 16 వరకు చలి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డిసెంబర్ 10-13వ మధ్య భారీగా ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. రాబోయే 10 రోజులు చలి గాలులకు సిద్ధంగా ఉండాలని అధికారులు చెప్పారు. గత రెండు రోజులుగా తెల్లవారుజామున రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. అసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, పెద్దపల్లి, వరంగల్, సంగారెడ్డిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.