నేడు తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కేసులో ఇద్దరిని కస్టడీకి తీసుకోనున్న సిట్.. సీట్ విచారణ కోసం 4 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన నెల్లూరు ఏసీబీ కోర్టు.. A16 సుగంధి, A29 టీటీడీ అధికారి సుబ్రహ్మణ్యంను కస్టడీ తీసుకొనున్న సిట్
పార్వతీపురం మన్యంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్యటన.. ఉదయం 9:30 గంటలకు సాలూరు పట్టణంలో 20వ వార్డు వడ్డివీధి న్యూ పైలట్ వాటర్ స్కీమ్స్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రి
నేటితో ముగియనున్న నకిలీ మద్యం తయారీ కేసు నిందితుల కస్టడీ.. జోగి రమేష్ సహా నిందితులను వర్చువల్ ద్వారా కోర్టులో హాజరు
పరిచే అవకాశం.. కోర్టుకు తీసుకురావాలని జడ్జిని ఇప్పటికే కోరిన జోగి రమేష్ అడ్వకేట్
పద్మావతి అమ్మవారి ఆలయ జరిగిన పరిణామాలపై నేడు ఉన్నతాధికారులక విజిలెన్స్ ఇచ్చే అవకాశం.. పద్మావతి అమ్మవారి ఆలయంలో అర్చకులు మధ్య కోల్డ్ వార్.. అర్చకుల మధ్య విభేదాలతో బయటపడుతున్న ఆలయ లోపాలు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. నేటితో ముగియనున్న తొలివిడత ఎన్నికల ప్రచారం.. డిసెంబర్ 11న పోలింగ్
నేడు అన్ని జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.. రోడ్లు భవనాలు శాఖ ఆద్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు.. నేడు వర్చువల్ గా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రులు
ఢిల్లీ: నేడు రాజ్యసభలో జాతీయ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చ.. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్యసభలో ప్రారంభం కానున్న చర్చ.. వందేమాతరంపై చర్చ ప్రారంభించనున్న కేంద్రమంత్రి జేపీ నడ్డా
నేడు కటక్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య మొదటి టీ20.. రాత్రి 7 గంటలకు బారాబతి స్టేడియంలో మ్యాచ్ ఆరంభం