నేడు పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగిన పరిణామాలపై ఉన్నతాధికారులకు విజిలెన్స్ రిపొర్టు ఇచ్చే అవకాశం ఉంది. పద్మావతి అమ్మవారి ఆలయంలో అర్చకులు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అర్చకుల మధ్య విభేదాలతో ఆలయ భద్రతా లోపాలు బయటపడుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకుడు బాబు స్వామి తన తమ్ముడు కొడుకును అనధికారికంగా ఆలయంలో గత కొన్నేళ్లుగా పని చేయించుకుంటున్నట్టు విజిలెన్స్ గుర్తించింది.
అనధికారికంగా విధులు నిర్వహించిన అవినాష్ సహా మరొక పరచారకుడు వ్యవహారాన్ని విజిలెన్స్ లోతుగా విచారణ చేపట్టింది. ఇద్దరు అనధికారికంగా ఆలయంలో విధులు నిర్వహించడంపై ఉన్నతాధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఓ వర్గంపై మరో వర్గం ఫిర్యాదు చేసుకోవడంతో అసలు వ్యవహారం బయటపడింది. తిరుమల తర్వాత రెండో ఆలయంగా ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.