తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. ఓ కళాశాలలో చదువుతున్బ మైనర్ బాలికపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. డబ్బు సాయం చేస్తానని నమ్మించి.. బాలికను రూమ్‌కు తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడు. స్నేహితురాలితో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో బాలిక ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం అలిపిరి పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన గత నెల మూడో తేదీన జరగగా.. ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది.
తిరుపతిలోని ఓ కళాశాలలో విద్యనభ్యసిస్తూ ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది ఓ విద్యార్థిని. ఓ హాస్టల్ నుంచి మరొక హాస్టల్‌కు మారేందుకు బాలిక ర్యాపిడో ఆటో బుక్ చేసుకుంది. ఏదైనా సాయం కావాలంటే చేస్తానంటూ ఆటో డ్రైవర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఫోన్‌లో పరిచయం పెంచుకున్న ఆటో డ్రైవర్.. ఏదైనా సహాయం కావాలంటే చేస్తానంటూ వల విసిరాడు. డబ్బు సాయం చేస్తానని మైనర్ బాలికను మభ్యపెట్టి రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయట చెబితే చంపేస్తానంటూ విద్యార్థినిని ఆటో డ్రైవర్ బెదిరించాడు.
Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026 వేలం నుంచి 1,005 మంది ప్లేయర్స్ ఔట్.. చివరి నిమిషంలో డికాక్ పేరు!
ఆటో డ్రైవర్ బెదిరింపులతో మైనర్ బాలిక భయపడిపోయింది. స్నేహితురాలితో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై క్రైమ్ నెంబర్ 448/2025 ఫోక్సో యాక్ట్ 2012 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండగా.. అతడిని పట్టుకొనే పనిలో అలిపిరి పోలీసులు ఉన్నారు. నిందితుడి కుటుంబసభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు మైనర్ బాలిక డీటెయిల్స్ గోప్యంగా ఉంచారు.