‘మొంథా’ తుఫాన్ ప్రభావం, తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో ఆదివారం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదని హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధమవ్వండని సూచించారు. అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలని సీఎం అధికారులకు చెప్పారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ తర్వాత […]
ఆస్ట్రేలియాకు రావడం తనకు చాలా ఇష్టం అని, ఇక్కడ అత్యుత్తమ క్రికెట్ ఆడాను అని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చి తమకు మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్నా.. ఆట ఎపుడూ కొత్త పరీక్ష పెడుతుందన్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన తర్వాత హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం సంతోషంగా ఉందని కోహ్లీ భావోద్వేగం […]
Kurnool Bus Fire Accident Mystery Solved: కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ వీడింది. చిన్నటేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. బైక్ నడుపుతూ చనిపోయిన శివశంకర్‌తో పాటు ఎర్రిస్వామి అనే వ్యక్తి ఉన్నాడు. చిన్నటేకూరు సమీపంలో శివశంకర్ బైక్ నడుపుతూ స్కిడై డివైడర్‌ను ఢీకొట్టాడు. దాంతో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డాడు. అదే సమయంలో బైక్‌ను కావేరి ట్రావెల్స్ బస్సు వచ్చి ఢీ కొట్టి కొద్దిదూరం […]
Rohit Sharma World Record: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 50వ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేయడంతో ఈ రికార్డు హిట్‌మ్యాన్ అందుకున్నాడు. టెస్టుల్లో 12, వన్డేల్లో 33, టీ20ల్లో ఐదు శతకాలు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రోహిత్ ఉన్నాడు. ఇప్పటివరకూఈ రికార్డు ఎవరి […]
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 38.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. స్టార్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సిడ్నీలో దుమ్మురేపారు. రోహిత్ 125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులతో 121 రన్స్ చేశాడు. కోహ్లీ 81 బంతుల్లో 7 ఫోర్లతో 74 పరుగులు చేశాడు. రోకోలు చెలరేగడంతో భారత్ సునాయాస […]
మహిళా వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రొటీస్ టీమ్ బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌తో ప్రపంచకప్‌లో అగ్రస్థానం ఎవరిది అనేది తేలిపోతుంది. సెమీస్‌లో భారత జట్టు ఎదురయ్యే ప్రత్యర్థి ఎవరో కూడా ఆ మ్యాచ్‌తో తేలనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు వేధింపులకు గురయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. దక్షిణాఫ్రికాతో […]
ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్, తెలుగు యాంకర్ వింధ్య విశాఖ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. జన్యుపరమైన కారణాలతో కిడ్నీ, లివర్ ఫెల్యూర్‌తో భాదపడుతున్న ఓ కుర్రాడికి తన వంతు సాయం చేశారు. అంతేకాదు ఆ బాలుడికి ఆరోగ్య శ్రీ వర్తించదని, అతడి కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స కోసం అందరూ సాయం చేయాలని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. నిరుపేద బాలుడికి ఆర్థిక సహాయం అందించిన వింధ్య విశాఖను అందరూ ప్రశంసిస్తున్నారు. సిద్దిపేట […]
సినీ ఇండస్ట్రీలో లుక్ ఎంతో ముఖ్యం. హీరోయిన్ అయినా.. హీరో అయినా మంచి లుక్ తప్పనిసరి. ఆ అందమే వారికి అవకాశాలను తీసుకొచ్చిపెడుతుంది. సినిమాలోని క్యారెక్టర్ కోసం కూడా హీరో, హీరోయిన్స్ ఎప్పటికప్పుడు తమ లుక్స్, ఫిజిక్ మారుస్తుంటారు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, నేచురల్ స్టార్ నాని, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సహా మరికొందరు హీరోలు తమ కొత్త సినిమాల కోసం పూర్తి గెటప్ మార్చేశారు. తాజాగా […]
దుబాయ్ పర్యటనలో చివరి కార్యక్రమంగా గల్ఫ్‌లోని తెలుగు ప్రజలతో డయాస్పోరా కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గల్ఫ్‌లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దుబాయ్కిలోని లీ మెరిడియన్ హోటల్లో అత్యంత ఉత్సాహభరితంగా తెలుగు డయాస్పోరా కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు జాతికి తిరుగే లేదని, ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా తయారవుతుందన్నారు. ప్రపంచంలో […]
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎస్పీడీసీఎల్లో వేలకోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. ఇది రెండు పార్టీల అవినీతి ప్రేమ కథ అని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. ప్రస్తుతం విచారించేంత పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. వైసీపీ హయాంలో అప్పటి సంతోష్ రావు లాంటి అధికారుల వల్లే ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కందుకూరు హత్య కేసులో లక్ష్మి నాయుడు కుటుంబానికి ప్రభుత్వ సాయంపై ఏబీ వెంకటేశ్వరరావు […]