ఓ హిట్ కొట్టి నెక్ట్స్ ఫిల్మ్ తీసుకురావడానికి ఏడాది లేదా రెండేళ్ల పాటు యంగ్ హీరోలు గ్యాప్ తీసేసుకుంటే మోహన్ లాల్ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలు దించేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఎంపురన్, తుడరుమ్, హృదయ పూర్వం సినిమాలతో హ్యాట్రిక్ కొట్టేసిన లాలెట్టన్ నెక్ట్స్ వృషభ లాంటి భారీ బడ్జెట్ ప్లాన్ దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఫాంటసీ యాక్షన్ డ్రామా.
Also Read : Akhanda2 Thaandavam : అఖండ – 2 కు RSS చీఫ్ అభినందనలు
వృషభ కన్నా ముందే మరో సర్పైజ్ ఇవ్వబోతున్నారు మోహన్ లాల్. మాలీవుడ్ వన్స్ అపాన్ ఎ టైం స్టార్ హీరో, తన ఫ్రెండ్ దిలీప్ హీరోగా ‘భా భా బా’ అనే ఫిల్మ్ రాబోతోంది. ఈ సినిమాలో క్యామియో అప్పీరియన్స్ ఇవ్వబోతున్నారు కంప్లీట్ స్టార్. నటి కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న దిలీప్‌ను తాజాగా నిర్ధోషిగా ప్రకటించింది కోర్టు. ఈ తీర్పు అనంతరం దిలీప్ నుండి వస్తున్న ఫిల్మ్ కావడంతో అంచనాలు పెరిగాయి. దీనికి తోడు లాలెట్టన్ స్పెషల్ అప్పీరియన్స్ మూవీకి మరింత ఎట్రాక్షన్ కాబోతోంది. గత ఏడాది ఎండింగ్‌లో తన దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంగా వచ్చిన బర్రోజ్‌తో చేతులు కాల్చుకున్నారు. మోహన్ లాల్. ఈ క్రిస్మస్‌కు కూడా వృషభ లాంటి ప్రయోగాత్మక మూవీతో రాబోతున్నారు. ఇప్పటికే ఈ బొమ్మ మల్టీపుల్ టైమ్స్ పోస్ట్ పోన్ అయ్యింది. అక్టోబర్ 16నే రావాల్సిన ఈ సినిమా వీఎఫెఎక్స్ డిలే వల్ల నవంబర్ 6కి వాయిదా వేసుకుంది. మళ్లీ అప్పటి నుండి క్రిస్మస్‌కు పోస్ట్ పోన్ చేసుకుంది. రిలీజ్‌కు రెండు వారాలే ఉండటంతో ఇప్పుడిప్పుడే ప్రమోషన్లను షూరూ చేసింది టీం. ఈ లెక్కన డిసెంబర్ 25న రావడం పక్కానే.