Rohit-Kohli: సిడ్నీలో దుమ్ములేపిన రోహిత్, కోహ్లీ.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం!
- సిడ్నీలో దుమ్ములేపిన రోహిత్, కోహ్లీ
- ఆస్ట్రేలియా భారత్ ఘన విజయం
- అక్టోబర్ 29 నుంచి టీ20 సిరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 38.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. స్టార్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సిడ్నీలో దుమ్మురేపారు. రోహిత్ 125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులతో 121 రన్స్ చేశాడు. కోహ్లీ 81 బంతుల్లో 7 ఫోర్లతో 74 పరుగులు చేశాడు. రోకోలు చెలరేగడంతో భారత్ సునాయాస విజయం సాధించింది. మొదటి రెండు వన్డేలలో గెలిచిన ఆసీస్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక టీ20 సిరీస్ అక్టోబర్ 29 నుంచి ఆరంభం కానుంది.
లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభం దక్కింది. శుభ్‌మన్ గిల్ (24), రోహిత్ శర్మ మొదటి వికెట్‌కు 69 రన్స్ చేశారు. మంచి ఊపుమీదున్న గిల్.. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తొలి బంతికే రన్ తీసి అభిమానుల్లో ఆశలు నింపాడు. మొదటి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో మంచి రిథమ్‌తో ఆడాడు. రోహిత్, కోహ్లీ స్వేచ్ఛగా పరుగులు చేశారు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 169 బంతుల్లో 168 పరుగులు జత చేశారు. రోహిత్, కోహ్లీల అద్భుత బ్యాటింగ్‌ను ఫాన్స్ ఎంజాయ్ చేశారు.
Also Read
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
Also Read: Australia Women: ఇండోర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు వేధింపులు!
అంతముకుందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ రెన్‌షా (56) హాఫ్ సెంచరీ చేశాడు. మిచెల్ మార్ష్ (41), ట్రావిస్ హెడ్ (29), మాథ్యూ షార్ట్ (30), అలెక్స్ కేరీ (24)లు పరుగులు చేశారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4, సుందర్ 2 వికెట్స్ పడగొట్టారు. సిరాజ్, కుల్దీప్, అక్షర్, ప్రసిద్ధ్ తలో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్‌ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!