ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి దామల నాగరాజు మృతి చెందారు. నామినేషన్ వేసిన అనంతరం నాగరాజు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. డాక్టర్లు బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందాడని నిర్దారించడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తరలించారు. నాగరాజుకు ఎన్నికల్లో ఉంగరం గుర్తును కేటాయించారు. ఎన్నికల రోజే ఇండిపెండెంట్ అభ్యర్థి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read: Sankranti 2025: కోనసీమలో జోరుగా కోడిపందేలు.. మొక్కుబడిగా పందెం రాయుళ్ల అరెస్టు!
మరోవైపు నేలకొండపల్లి పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న ఆటోలో ఉన్న వారిని ఓటు బీఆర్ఎస్ నాయకులు అభ్యర్థించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటు అభ్యర్థించడం ఏంటని కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. దాంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు.