సినీ ఇండస్ట్రీలో లుక్ ఎంతో ముఖ్యం. హీరోయిన్ అయినా.. హీరో అయినా మంచి లుక్ తప్పనిసరి. ఆ అందమే వారికి అవకాశాలను తీసుకొచ్చిపెడుతుంది. సినిమాలోని క్యారెక్టర్ కోసం కూడా హీరో, హీరోయిన్స్ ఎప్పటికప్పుడు తమ లుక్స్, ఫిజిక్ మారుస్తుంటారు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, నేచురల్ స్టార్ నాని, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సహా మరికొందరు హీరోలు తమ కొత్త సినిమాల కోసం పూర్తి గెటప్ మార్చేశారు. తాజాగా ఈ జాబితాలోకి చార్మింగ్ స్టార్ శర్వానంద్ చేరారు. ప్రస్తుతం శర్వా గుర్తుపట్టలేకుండా ఉన్నారు.
Also Read: CM Chandrababu: తెలుగు జాతికి తిరుగే లేదు.. ప్రపంచంలో నెంబర్ 1గా తయారవుతుంది!
శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘బైకర్’. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. 2025 దీపావళి సందర్భంగా బైకర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. స్పోర్ట్స్ బైక్‌తో రేస్ ట్రాక్‌పై దూసుకెళ్తున్న బైకర్‌లా శర్వా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈరోజు శర్వా మరో షాక్ ఇచ్చారు. శర్వా షర్ట్‌లెస్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఫోటోలలో శర్వా చాలా బక్కచిక్కి కనిపిస్తున్నారు. ముఖం కూడా పూర్తిగా లోపలికి పోయింది. ఇప్పటివరకూ ఎప్పుడూ కనిపించని రీతిలో సన్నగా ఉన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను చూసి ఫాన్స్ షాక్ అవుతున్నారు. ‘ఏంటి శర్వా ఇంతలా మారిపోయాడు’, ‘అయ్య బాబోయ్.. అతను శర్వానందేనా’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.