కార్తీక సోమవారం వేళ వృషభ రాశి వారికి నేడు అన్నీ కలిసిరానున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన లాభాలు కలిసి వస్తాయి. సుఖాలు, సంతోషాలు, సౌఖ్యాలు ఆనందాన్ని ఇస్తుంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. దంపతుల మధ్య అనుబంధాలు మరింత బలపడతాయి. ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలించే దైవం పార్వతి పరమేశ్వరులు. అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణం చేస్తే మంచిది. ఈ కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలను ‘భక్తి టీవీ’ మీకు అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ […]
టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సిడ్నీలో మెరిశాడు. పెర్త్, అడిలైడ్‌లో డకౌట్ అయిన కోహ్లీ.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో హాఫ్ సెంచరీతో అలరించాడు. 81 బంతుల్లో 7 ఫోర్లతో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ హాఫ్ సెంచరీతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. కింగ్ నెలకొల్పిన ఆ రికార్డ్స్ ఏంటో చూద్దాం. వన్డే చరిత్రలో లక్ష […]
మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డికి ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి కార్యకర్తలకు గుండు సూది గుచ్చాలని చూసినా.. గునపాలు దిగుతాయి జాగ్రత్త అని హెచ్చరించారు. పోనీలే అని ఊరుకుంటున్నాం అని, ఇలాగే మాట్లాడితే ఉపేక్షించే పరిస్థితి ఉండదన్నారు. అధికారం అడ్డం పెట్టుకుని ఏదైనా చేస్తే ఒక్కరు కూడా ఊళ్లో ఉండలేరన్నారు. ఎవరైనా ప్రజల జోలికి వస్తానంటే తాటతీస్తాం అంటూ మంత్రి సత్యకుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేతి […]
సిడ్నీ వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆసీస్ నిర్దేశించిన 237 పరుగుల లక్షాన్ని భారత్ 38.2 ఓవర్లలోఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. టీమిండియా విజయంలో సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (121), విరాట్ కోహ్లీ (74)లు కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం కామెంటేటర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, రవిశాస్త్రిలతో రో-కోలు మాట్లాడుతూ ఆస్ట్రేలియన్ క్రికెట్‌తో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగం చెందారు. మరోసారి ఆస్ట్రేలియా […]
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో సెమీఫైనల్స్‌లో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. అక్టోబర్ 30న నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మధ్యాహ్నం 3 గంటలకు ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ విషయం తెలిసిన టీమిండియా ఫాన్స్ కాస్త కంగారుపడుతున్నారు. ‘అబ్బా సాయిరాం.. ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియాను భారత్ ఓడించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. […]
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజక వర్గాలతో పాటు తాళ్ళరేవు మండలం పైనా తుపాన్ ప్రభావం […]
‘మొంథా’ తుఫాన్ ప్రభావం, తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో ఆదివారం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదని హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధమవ్వండని సూచించారు. అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలని సీఎం అధికారులకు చెప్పారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ తర్వాత […]
ఆస్ట్రేలియాకు రావడం తనకు చాలా ఇష్టం అని, ఇక్కడ అత్యుత్తమ క్రికెట్ ఆడాను అని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చి తమకు మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్నా.. ఆట ఎపుడూ కొత్త పరీక్ష పెడుతుందన్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన తర్వాత హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం సంతోషంగా ఉందని కోహ్లీ భావోద్వేగం […]
Kurnool Bus Fire Accident Mystery Solved: కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ వీడింది. చిన్నటేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. బైక్ నడుపుతూ చనిపోయిన శివశంకర్‌తో పాటు ఎర్రిస్వామి అనే వ్యక్తి ఉన్నాడు. చిన్నటేకూరు సమీపంలో శివశంకర్ బైక్ నడుపుతూ స్కిడై డివైడర్‌ను ఢీకొట్టాడు. దాంతో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డాడు. అదే సమయంలో బైక్‌ను కావేరి ట్రావెల్స్ బస్సు వచ్చి ఢీ కొట్టి కొద్దిదూరం […]
Rohit Sharma World Record: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 50వ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేయడంతో ఈ రికార్డు హిట్‌మ్యాన్ అందుకున్నాడు. టెస్టుల్లో 12, వన్డేల్లో 33, టీ20ల్లో ఐదు శతకాలు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రోహిత్ ఉన్నాడు. ఇప్పటివరకూఈ రికార్డు ఎవరి […]