ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహిస్తుంటారు. ఏ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11 రోజులపాటు జరిగే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో శ్రీనివాసరావు స్పందించారు. భక్తులు సంతృప్తికరమైన సమాధానం అనుభవాన్ని పంచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. దర్శనం విషయంలో క్యూలైన్స్‌లో ఒత్తిడి లేకుండా.. ఏ లైన్ దేనికి అనేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అటవీశాఖ సమన్వయంతో పాదయాత్ర భక్తులు నడిచే రహదారిని గ్రావెల్‌తో సరిచేస్తాం అని ఈవో పేర్కొన్నారు.
శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ… ‘భక్తులు సంతృప్తికరమైన సమాధానం అనుభవాన్ని పంచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాం. దర్శనం విషయంలో క్యూలైన్స్‌లో ఒత్తిడి లేకుండా ఏ లైన్ దేనికి అనేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. అటవీశాఖ సమన్వయంతో పాదయాత్ర భక్తులు నడిచే రహదారిని గ్రావెల్‌తో సరిచేస్తాం. పాదయాత్ర భక్తులకు మంచినీరు, చలువ పందిళ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం. అటవీ ప్రాంతంలో ఉన్న మంచినీరు త్రాగడానికి బాగుందా లేదా చూసి టాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తాం. ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలకు గత సంవత్సరం కంటే 15 శాతం ఏర్పాట్లు ఎక్కువగా చేస్తాం’ అని తెలిపారు.
‘ఈనెల 31 లోపు ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యేలా చూసి.. మిగిలిన 19 రోజులు ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే సరిచేస్తాం. ప్రతి శాఖతో సమన్వయం చేసుకునేందుకు ఇప్పటికే 54 లేఖలు ఆయా శాఖలకు పంపించాం. ఉత్సవాలలో ప్రధాన సమస్య భక్తులు వాడిపడేసిన చెప్పులు, బట్టలు పర్యావరణానికి ఇబ్బంది లేకుండా డంపింగ్ యార్డుకు తరలిస్తాము. శివరాత్రి బ్రహ్మోత్సవాలపై త్వరలో జిల్లా కలెక్టర్తో సమావేశం ఉంటుంది’ అని శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.