గుడివాడలోని రైలుపేటలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటి సమీపంలో ముఠా కార్మికుడిగా పనిచేస్తున్న ఎండూరి జోజి బాబు (45) చిన్నారిపై దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారిని చికిత్స నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైలుపేటలోని బాలిక ఇంటి వద్ద గుడివాడ డీఎస్పీ అబ్దుల్ సుబాన్ స్వయంగా విచారణ చేశారు. కామాంధుడు జోజి బాబును పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో మరో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై యువకుడు కోటిపల్లి రాజు లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువకుడు కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి బాలికపై పలుసార్లు అత్యాచారం చేశాడు. నేడు బాలిక అస్వస్థతకు గురికాగా.. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. బాలిక 3 నెలలు గర్భిణిగా వైద్యుల నిర్థారించారు. విషయం తెలిసిన యువకుడు పరార్ అయ్యాడు. ఆమదాలవలస పోలీసులకు బాధితురాలి కుటుంబ సభ్యుల పిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.