నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మూడు రోజులపాటు సొంత నియోజకవర్గంపై సీఎం ఫోకస్ చేయనున్నారు.
ఈరోజు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు.
మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు.
ఇవాళ ఏపీకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రానున్నారు. సాయంత్రం 5:30 గంటలకు బెంగుళూరు నుంచి గన్నవరం విమానాశ్రయంకు చేరుకుని.. 6 గంటలకు రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లి తన నివాసానికి చేరుకుంటారు.
నేడు కాకినాడ నుంచి స్టెల్లా ఎల్ పనానా షిప్ బయలుదేరనుంది. నవంబర్ 11 నుంచి కాకినాడలోనే షిప్ ఉన్న విషయం తెలిసిందే.
ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నారు. జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు.
నేడు చిత్తూరు జిల్లా కుప్పంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించనున్నారు.
యానాంలో నేటి నుంచి మూడు రోజులు పాటు ఫలపుష్ప ప్రదర్శన, ప్రజా ఉత్సవాలు జరగనున్నాయి. పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. పుష్ప 2 ఎడ్ల బండి, ఎర్ర చందనం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
నేడు సాయంత్రం జెన్ కో ఏఈ, కెమిస్ట్ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాల పంపిణీ చేయనున్నారు. జూపార్కు నుండి ఆరాంఘర్ వరకు చేపట్టిన 6 లేన్ల ఫ్లైఓవర్ సీఎం ప్రారంభించనున్నారు.
నేడు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. దీపా దాస్ మున్షీ, మహేష్ కుమార్ గౌడ్, విశ్వనాథన్ తదితరులు హజరుకానున్నారు.
మంత్రి సీతక్క నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొననున్నారు.
వరంగల్ జిల్లాలో నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఎలక్ట్రికల్ బస్సులను మంత్రి పొన్నం ప్రారంభించనున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద కవిత మాట్లాడనున్నారు. ఆ తరువాత కొమురం భీం జిల్లాలో పర్యటించనున్నారు.
జమ్మూ రైల్వే డివిజన్, తెలంగాణలోని టెర్మినల్ స్టేషన్ సహా పలు రైల్వే ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు.