Vijayasai Reddy: ఈడీ విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి!
- ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి
- బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి
- మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించిన ఈడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి వచ్చారు. కాకినాడ పోర్టు సెజ్‌కు సంబంధించిన కేసులో ఈడీ ఎదుట ఆయన విచారణకు ఆయన హాజరయ్యారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలపై వైసీపీ ఎంపీని ఈడీ అధికారులు ఎంత సేపు విచారణ చేస్తారో చూడాలి.
వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ (కేఎస్‌పీఎల్), కాకినాడ సెజ్ (కేసెజ్)ల్లోని రూ.3,600 కోట్ల విలువైన షేర్లను కేవీ రావు (కర్నాటి వెంకటేశ్వరరావు) నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్‌లోని మేజర్ వాటాను బలవంతంగా తీసుకున్నారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. రూ.2,500 కోట్ల విలువ చేసే 41 శాతం షేర్లను రూ.494 కోట్లకు, సెజ్‌లో రూ.1100 కోట్ల విలువ చేసే షేర్లను కేవలం రూ.12 కోట్లకు బలవంతంగా తీసుకున్నారని కేసు నమోదయింది.
Also Read
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
- T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
కేఎస్‌పీఎల్, కేసెజ్ కేసుల్లో ఓ వైపు సీఐడీ దర్యాప్తు చేస్తుంటే.. మరోవైపు ఈడీ కూడా లావాదేవీలపై ఆరా తీసింది. మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించిన ఈడీ.. కీలక వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో పాటు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలోనే నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని సూచించింది. అయితే పార్లమెంట్ సమావేశాల కారణంగా ఆయన హజరుకాలేదు. ఈడీ మళ్లీ నోటీసులు ఇవ్వడంతో నేడు ఆయన విచారణకు హాజరయ్యారు.
- Tags
- cid
- ED
- kakinada port
- vijayasai reddy
- ycp
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..