ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కెరీర్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్లో 10 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ ఈ మార్క్‌ను అందుకున్నాడు. ప్రబాత్ జయసూర్య వేసిన 31 ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసిన స్మిత్.. సాంప్రదాయ ఫార్మాట్లో 10 వేల రన్స్ పూర్తి చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో అరుదైన మైలురాయిని అందుకున్న స్మిత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 115 […]
2012 తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. జనవరి 30 నుంచి రైల్వేస్‌తో ప్రారంభం అయ్యే రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున విరాట్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ కోసం మంగళవారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మిగతా ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ కూడా చేశాడు. 13 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతుండడంతో అందరి కళ్లు కోహ్లీపైనే ఉన్నాయి. విరాట్ ఆట చూసేందుకు ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. రోస్టర్ విధానంలో మూడు […]
అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025లో తెలంగాణ అమ్మాయి గొంగిడి త్రిష అదరగొడుతున్న విషయం తెలిసిందే. టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన త్రిష 230 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌పై (40), శ్రీలంకపై (49)పై కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన తెలుగమ్మాయి.. స్కాట్లాండ్పై సెంచరీ (110) చేసింది. 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సులతో శతకం బాదింది. దాంతో అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి మహిళగా త్రిష రికార్డు సృష్టించింది. ఈ రికార్డుపై మాజీ మంత్రి, […]
కొనుగోలు దారులకు బంగారం ధరలు భారీ షాక్ ఇచ్చాయి. వరుస రెండు రోజులు స్థిరంగా ఉండి, ఆపై రెండు తగ్గిన గోల్డ్ రేట్లు.. నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.850.. 24 క్యారెట్లపై రూ.920 పెరిగింది. దాంతో బులియన్ మార్కెట్లో బుధవారం (జనవరి 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,950గా.. 24 క్యారెట్ల ధర రూ.82,850గా నమోదైంది. రేట్స్ భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు గోల్డ్ కొనాలంటే […]
మంగళవారం రాత్రి ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ ఓడిపోవడం తనను చాలా బాధించిందని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తెలిపాడు. మ్యాచ్‌ను తాము అనుకున్నవిధంగా ముగించలేకపోయామన్నాడు. ఫలితం గురించి ఆలోచించడం పక్కన పెట్టి తర్వాత మ్యాచ్ కోసం సిద్ధమవుతా అని చెప్పాడు. ఈ మ్యాచులో బౌలింగ్ వేసి ఉండొచ్చు కానీ.. మున్ముందు ఇంకా మెరుగ్గా వేయాల్సిన అవసరం ఉందని చక్రవర్తి చెప్పుకొచ్చాడు. మూడో టీ20లో చక్రవర్తి (5/24) అద్భుత ప్రదర్శన చేశాడు. చక్రవర్తి ఐదు […]
ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్‌పై ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ప్రశంసలు కురిపించాడు. రషీద్ కారణంగానే భారత్‌తో జరిగిన మూడో టీ20లో గెలిచామని చెప్పాడు. రషీద్ తమ జట్టులో ఉండటం అదృష్టం అని, వైవిధ్యంగా బంతులేయడం అతడి స్పెషాలిటీ అని పేర్కొన్నాడు. రషీద్, మార్క్ వుడ్ కలిసి ఇన్నింగ్స్ చివరలో విలువైన పరుగులు చేయడం కూడా కలిసొచ్చిందని బట్లర్ చెప్పుకొచ్చాడు. మంగళవారం రాత్రి భారత్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించింది. […]
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు దక్కింది. ఐసీసీ అత్యున్నత పురస్కారం ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ (2024) అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. సర్ గ్యారిఫీల్డ్ సోబర్స్ పేరిట ఇచ్చే ఈ పురస్కారం కోసం బుమ్రాతో పాటు జో రూట్, హ్యారీ బ్రూక్, ట్రావిస్ హెడ్ పోటీ పడ్డారు. 2024లో భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో బుమ్రా అత్యంత కీలక ప్రాత పోషించాడు. మరోవైపు గతేడాది టెస్టుల్లో స్వదేశం, విదేశం అని […]
రంజీ ట్రోఫీలో ముంబై జట్టు రోహిత్ శర్మ లేకుండానే బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 6న ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం రోహిత్ భారత జట్టుతో చేరాడు. దీంతో గురువారం మేఘాలయాతో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ గ్రూపు-ఎ మ్యాచ్‌లో ముంబై హిట్‌మ్యాన్ లేకుండానే ఆడనుంది. మరోవైపు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ కూడా ముంబై తరఫున బరిలో దిగడం లేదు. వీరి స్థానాల్లో ఆంగ్క్రిష్ రఘువంశి, సూర్యాంష్ షెడ్గే, అథర్వ అంకోలేకర్‌లను […]
నేడు అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సుమారు రెండు గంటల పాటు జరిగింది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు కావడంతో ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఎంపీలు పార్లమెంట్లో తమ స్వరం వినిపించాలని చంద్రబాబు అన్నారు. కేంద్రం నుంచి అదనపు నిధులు తేవడంపై దృష్టి పెట్టాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల రాష్ట్రానికి అదనపు ప్రయోజనాలు రావాలన్నారు సీఎం. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ సమస్యలు, ఆర్ధిక పరిస్థితిపై అవకాశం ఉన్నప్పుడు ప్రతిసారి […]