ప్రభుత్వ పథకం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వం పథకం రూపొందించిందని, పట్టణ (మున్సిపాలిటీల పరిధి) రైతు కూలీలకు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని శ్రీనివాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు హాజరయ్యారు. Also Read: Ration Cards: రేషన్ కార్డులు ఇవ్వడం […]
గతంలో ఎవ్వరూ రేషన్ కార్డులు ఇవ్వలేదనట్లు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతోందని, రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమా? అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరు లక్షల యాబై వేల రేషన్ కార్డులు ఇచ్చామని, కాంగ్రెస్ సర్కార్ లాగా ఏనాడూ ప్రచారం చేసుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో చేసిన పనులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదన్నారు. జనవరి 30వ తారీఖు నాడు 420 హామీలు ఇచ్చి 420 రోజులు అవుతుందని […]
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్థాపం చెందిన ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో సోమవారం చోటుచేసుకుంది. రైతు మరణంతో కిష్టంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్దదిక్కు మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. Also Read: Phone Tapping Case: అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు ఊరట! వివరాల ప్రకారం… పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ […]
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్నకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. తిరుపతన్న బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. కేసు దర్యాప్తు, విచారణకి పూర్తిగా సహకరించాలని.. సాక్షులని ప్రభావితం చేయవద్దని తిరుపతన్నకు సుప్రీంకోర్టు కండిషన్స్ పెట్టింది. దాంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి తెలంగాణ ప్రభుత్వంకు గట్టి షాక్ తగిలింది. గడిచిన 10 నెలలుగా తిరుపతన్న జైలులో ఉన్న […]
వైద్య రంగంలో విశేష సేవలు అందించినందుకు సంతోషంగా ఉందని, పద్మవిభూషణ్ అవార్డు తనలో బాధ్యతని ఇంకా పెంచిందని ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. పద్మవిభూషణ్ అవార్డు తనకు రాలేదని.. వైద్య రంగానికి, తన ఇన్స్టిట్యూషన్కు వచ్చిందని భావిస్తానన్నారు. ఏఐని వినియోగించి.. తక్కువ ఖర్చులతో వైద్యాన్ని క్షేత్ర స్థాయిలో అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు వైద్య వృత్తిలో ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లేవారని, ఇపుడు ఇతర దేశాల నుంచి మన దగ్గరికి రీసెర్చ్ […]
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమ్మెకు వెళ్లాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (జనవరి27) సాయంత్రం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఎండీని కలిసి సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో పాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని కోరనున్నారు. ఆర్టీసీలో విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ.. శుక్ర, శనివారం కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు […]
తెలంగాణలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా సూర్యాపేటలో పరువు హత్య కలకలం రేపింది. ఆదివారం ఆర్ధరాత్రి నగర శివారులోని మూసీ కాల్వ కట్టపై ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి అనే యువకుడు హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. యువకుడిని దుండగులు బండ రాళ్లతో మోదీ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: Hydra […]
ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రాణిగంజ్‌లోని బుద్ధ భవన్లో ఉన్న హైడ్రా కార్యాలయంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు (జనవరి 27) బుద్ధ భవన్లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 వరకు ఫిర్యాదులు తీసుకుంటారు. ఫిర్యాదుకు సంబంధించిన తగిన ఆధార పత్రాలతో పాటు పూర్తి వివరాలను ఫిర్యాదుదారులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. హైడ్రా ప్రజావాణికి మద్దతు భారీగా పెరిగింది. Also […]
నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో ఆదివారం రాత్రి అపశ్రుతి చోటు చేసుకున్నా విషయం తెలిసిందే. బాణసంచా పేల్చేందుకు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్కు చెందిన రెండు బోట్లలో బాణ సంచా సామగ్రిని సాగర్ మధ్యలోకి తీసుకెళ్లారు. టపాసులు పేలుస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు తిరిగి అదే బోట్లపై పడ్డాయి. దాంతో బోట్లలో ఉన్న బాణసంచా పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు […]
జనగామ నియోజకవర్గంలోని ఎర్రగుంటతండాలో ఆదివారం బీఆర్ఎస్ కార్యకర్తలపై జరిగిన దాడిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఖండించారు. ఈరోజు జరిగిన అరాచకం నిజాంపాలనలో కూడా జరగలేదని పల్లా మండిపడ్డారు. పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోమని, మలి దశ ఉద్యమ సమయంలో పోరాడిన గడ్డ జనగామ అని మర్చిపోవద్దని హెచ్చరించారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రారంభించిన 4 పథకాలను పేదలందరికీ అందించాలని కోరిన ఎమ్మెల్యే పల్లా, […]