అండర్-19 మహిళల ప్రపంచకప్ 2025 రెండో సెమీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ కెప్టెన్ అబీ నారోగ్రోవ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ప్రపంచకప్‌లో జోరుమీదున్న భారత జట్టును ఆపడం ఇంగ్లండ్‌కు పెను సవాలే. టోర్నీలో అపజయమే లేని భారత్ సెమీస్‌లోనూ గెలవాలనే పట్టుదలతో ఉంది. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. గ్రూప్ దశలో వెస్టిండీస్, […]
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఢిల్లీ అభిమానులకు తీవ్రంగా నిరాశపరిచాడు. రంజీ ట్రోఫీ 2025లో భాగంగా రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన కింగ్.. సింగిల్ డిజిట్ (6)కే పెవిలియన్‌కు చేరాడు. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో రైల్వేస్ బౌలర్ హరీష్ సంగ్వాన్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. దాంతో విరాట్ ఆటను చూద్దామని వచ్చిన అభిమానులు నిరాశగా అరుణ్ జైట్లీ స్టేడియంను వీడుతున్నారు. మరోవైపు విరాట్ కూడా అసహనంతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సబంధించిన […]
బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. పసిడి ధరలు వరుసగా మూడో రోజు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో గోల్డ్ రేట్స్ ఆల్‌టైమ్ రికార్డు ధరకు చేరుకున్నాయి. బులియన్ మార్కెట్లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1200 పెరిగి.. రూ.77,300గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1310 పెరిగి.. రూ.84,330గా ఉంది. బడ్జెట్ ప్రవేశానికి ముందు బంగారం ధరలు పెరగడం విశేషం. ఆల్‌టైమ్ రికార్డుకు చేరుకోవడంతో పసిడి ప్రియులు హడలెత్తిపోతున్నారు. మరోవైపు వెండి రేటు […]
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాకతో రంజీ ట్రోఫీ 2025కి కొత్త జోష్ వచ్చింది. అంతర్జాతీయ మ్యాచ్ మాదిరి అరుణ్ జైట్లీ స్టేడియం ‘కోహ్లీ.. కోహ్లీ’ నినాదాలతో హోరెత్తింది. గురువారం ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూపు-డి మ్యాచ్‌లో విరాట్ బరిలోకి దిగాడు. కింగ్ ఫీల్డింగ్ చేస్తేనే అభిమానులు కేరింతలతో మైదానాన్ని హోరెత్తించారంటే.. ఇక బ్యాటింగ్ దిగి బౌండరీలు బాదితే ఇంకేమన్నా ఉందా?. మొత్తానికి విరాట్ రంజీ ట్రోఫీ 2025కి కళ […]
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ ఆరంభోత్సవాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కలిసి ఫిబ్రవరి 16న లాహోర్‌లో నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంకు చారిత్రక లాహోర్ కోటలోని హుజూరి బాగ్ వేదిక కానుంది. అయితే ఐసీసీ టోర్నీ ఆరంభానికి ముందు సంప్రదాయంగా వస్తున్న అన్ని జట్ల కెప్టెన్ల ఫొటోషూట్, మీడియా సమావేశాన్ని ఈసారి నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రధాన జట్లు […]
మహిళల అండర్-19 ప్రపంచకప్ 2025లో జోరుమీదున్న భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్ స్టేడియంలో శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది. భారత కాలమానం ప్రకారం.. మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. మొదటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మహిళలు తలపడనున్నారు. సెమీఫైనల్లో గెలిచిన జట్లు ఆదివారం జరిగే ఫైనల్లో ఢీ కొట్టనున్నాయి. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. గ్రూప్ దశలో వెస్టిండీస్, మలేసియాలను 10 వికెట్ల తేడాతో […]
ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మూడో టీ20లో ఓడిన సూర్యసేన.. తిరిగి గెలుపు బాట పట్టి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. తొలి విజయం రుచి చూసిన ఇంగ్లండ్ నాలుగో టీ20లో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. పుణెలో శుక్రవారం కీలక నాలుగో టీ20 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనుంది. రాత్రి 7 నుంచి మ్యాచ్ ఆరంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. 2024లో సంచలన ఇన్నింగ్స్‌లు […]
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్‌కి దీటుగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలనే లక్ష్యంతో దావోస్ పర్యటనకు వెళ్లామని తెలిపారు. పెట్టుబడుల ఒప్పందాలు ఘనంగా జరిగాయని, తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన కంపెనీలకి మంత్రి ధన్యవాదాలు చెప్పారు. పెట్టుబడులే లక్ష్యంగా ఇటీవల సీఎం […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) బడ్జెట్‌ను అడ్డుకోవడం అంటే హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని హైదారాబాద్ ఇన్చార్జి, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమే అని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ నాయకత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో గత పది ఏళ్లలో లేని అభివృద్ది ఇప్పుడు జరుగుతుంటే ఈర్శగా ఉందా? అని మంత్రి పొన్నం విమర్శించారు. జీహెచ్ఎంసీ […]
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మాత్రం మోసం చేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుందని స్పష్టం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉద్దేశం డబ్బులు లేవని కాదని, అధికారుల వల్ల కొంత ఆలస్యం అవుతుందన్నారు. జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నామని, మేయర్ పీఠం గెలుచుకుంటామని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ […]