Steve Smith: అరుదైన మైలురాయికి అందుకున్న స్టీవ్ స్మిత్.. రికార్డులే రికార్డులు!
- స్మిత్ కెరీర్‌లో అరుదైన మైలురాయి
- టెస్ట్ ఫార్మాట్‌లో 10 వేల రన్స్ పూర్తి
- ఐదవ బ్యాటర్‌గా స్మిత్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 10 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ ఈ మార్క్‌ను అందుకున్నాడు. ప్రబాత్ జయసూర్య వేసిన 31 ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసిన స్మిత్.. సాంప్రదాయ ఫార్మాట్‌లో 10 వేల రన్స్ పూర్తి చేశాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్న స్మిత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 115 టెస్టుల్లో 10 వేల రన్స్ చేశాడు. ఇందులో 34 సెంచరీలు ఉండగా, 41 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్మిత్ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 239.
టెస్ట్ ఫార్మాట్‌లో 10 వేల పరుగులను పూర్తి చేసిన నాలుగో ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. దిగ్గజాలు అలన్ బోర్డర్, స్టీవ్ వా, రికీ పాంటింగ్‌లు స్మిత్ కంటే ముందున్నారు. మొత్తంగా 10 వేల పరుగులను పూర్తి చేసిన 15వ బ్యాటర్‌గా రికార్డుల్లో ఉన్నాడు. 10 వేల టెస్ట్ పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన ఐదవ బ్యాటర్‌గా (205 ఇన్నింగ్స్‌లు) కూడా నిలిచాడు. ఈ జాబితాలో బ్రియాన్ లారా (195) అగ్రస్థానంలో ఉన్నాడు. 35 ఏళ్ల స్మిత్ 55 కంటే ఎక్కువ సగటుతో 10 వేల రన్స్ చేశాడు. కుమార సంగక్కర మాత్రమే (57.40) స్మిత్ కంటే ముందున్నాడు.
Also Read
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
టెస్ట్ క్రికెట్‌లో ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా 10,000 పరుగులు:
195 – బ్రియాన్ లారా – మాంచెస్టర్, 2004 (ఇంగ్లాండ్)
195 – సచిన్ టెండూల్కర్ – కోల్‌కతా, 2005 (పాకిస్థాన్)
195 – కుమార్ సంగక్కర – మెల్బోర్న్, 2012 (ఆస్ట్రేలియా)
196 – రికీ పాంటింగ్ – ఆంటిగ్వా, 2008 (వెస్టిండీస్)
205 – స్టీవ్ స్మిత్ – గాలె, 2025 (శ్రీలంక)
206 – రాహుల్ ద్రవిడ్ – చెన్నై, 2008 (సౌతాఫ్రికా)
టెస్ట్ క్రికెట్‌లో మ్యాచ్‌ల పరంగా అత్యంత వేగంగా 10,000 పరుగులు:
111 – బ్రియాన్ లారా – మాంచెస్టర్, 2004 (ఇంగ్లాండ్)
115 – కుమార్ సంగక్కర – మెల్బోర్న్, 2012 (ఆస్ట్రేలియా)
115 – స్టీవ్ స్మిత్ – గాలె, 2025 (శ్రీలంక)
116 – యూనిస్ ఖాన్ – జమైకా, 2017 (వెస్టిండీస్)
118 – రికీ పాంటింగ్ – ఆంటిగ్వా, 2008 (వెస్టిండీస్)
118 – జో రూట్ – లార్డ్స్, 2022 (న్యూజిలాండ్)
THE HISTORIC MOMENT 🙇
– The Greatest Test batter of Modern Era completed 10,000 runs.
Take a bow, Steve Smith. ⭐ pic.twitter.com/XI6FLMNIgf
— Johns. (@CricCrazyJohns) January 29, 2025
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!